- అభివృద్ధి సంక్షేమాన్ని మరిచి ఢిల్లీ ప్రదక్షిణ చేస్తున్న ముఖ్యమంత్రి
- తుంగతుర్తి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులు తప్ప కొత్తగా అభివృద్ధి శూన్యం
- మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి ముద్ర:-రాష్ట్రంలో సాగుతున్నది ప్రజా పాలన కాదని ప్రజా వ్యతిరేక పాలన అని నిర్బంధాలతో అరెస్టులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. శనివారం తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదన పెరిగినప్పటికీ రైతులకు 24 గంటలపాటు విద్యుత్ అందించలేని పాలన కొనసాగుతుందని అన్నారు .సమయంలో వర్షాలు కురియక కరువు కరాల నృత్యం చేస్తున్న కాలేశ్వరం ద్వారా సాగునీరు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు . రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధు ఇవ్వకపోగా తాము ప్రకటించిన 15000 రైతుబంధు హామీలు తుంగలో తొక్కారని అన్నారు. రైతు భరోసా ఎక్కడ పాయని. రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడమే తప్ప అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఇప్పటికే 17 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారని.
తుంగతుర్తి నియోజకవర్గంలో తాను శాసనసభ్యుడిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప కొత్తగా ఒక్క పథకం కూడా అమలు కాలేదని తాను అందించిన పనులకే ప్రస్తుతం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నారు అన్నారు. గడచిన పది సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గం ప్రశాంతంగా లేని నియోజకవర్గంలో ప్రస్తుతం తమ కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదు చేసుకున్న వారు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.కార్యకర్తలు అధైర్య పడకుండా కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు.
రానున్న కాలంలో ప్రజలు తిరిగి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని కోరుకుంటున్నారని మళ్లీ బి.ఆర్.ఎస్. ప్రజలు అన్ని విధాల గమనించి ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో బదులు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.