Home తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ముఖ్యమంత్రుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విభజన అంశాల పరిష్కారం కోసం నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాదులో సమావేశమయ్యారు. ప్రజాభవన్ లో ఒక గంట 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. సీఎంల సమావేశం అనంతరం తెలంగాణ, ఏపీ మంత్రులు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి నేను, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ నుంచి సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్‌ గారు అందరం ఈ సమావేశానికి హాజరయ్యామని.

“ఈ సమావేశంలో అనేక చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి, ఇరు రాష్ట్రాలకు చెందిన అపరిష్కృత అంశాలు త్వరితగతిన చర్చించుకుని ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో ఈ సమావేశాన్ని నేడు ఏర్పాటు చేయడం జరిగింది.

విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకు ఈ పరిష్కారం లభిస్తుందని మేం ఆశించలేదు. కాకపోతే, వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి విధానపరమైన వ్యవస్థలు ఏర్పాటుకు రెండు రాష్ట్రాల సీఎంలు సహా ప్రతినిధుల బృందాలు కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాం.

ముందుగా, రెండు రాష్ట్రాల ఉన్నతస్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల సీఎస్‌ స్థాయి అధికారులు, రాష్ట్రానికి ముగ్గురు చొప్పున సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ మరో రెండు వారాల్లో సమావేశమై వారి స్థాయిలో పరిష్కారం లభించే విషయం చర్చిస్తుంది.

ఈ ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కాని అంశాలు ఉంటే… రెండు రాష్ట్రాల మంత్రులతో కూడిన ఒక కమిటీ వేయాలని నిర్ణయించాం. అపరిష్కృత అంశాలపై ఈ మంత్రుల కమిటీ సమావేశమై చర్చిస్తుంది. మంత్రుల కమిటీలో పరిష్కారమైన అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం జరుగుతుంది.

ఒకవేళ మంత్రుల కమిటీ ద్వారా కూడా అనేక అంశాలకు పరిష్కారం లభించకపోతే, మళ్లీ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మూడు దశల్లో సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ సిద్ధం చేశాం. ఈనాటి సమావేశంలో ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం ఇదే.

ఇక, ఇదే సమావేశంలో మరో ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నార్కోటిక్స్ డ్రైవ్ చేపడుతోంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటాం. సైబర్ నేరాలతోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అందుకే… యాంటిస్ట్ డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడి కార్యాచరణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక సమన్వయ కమిటీ ద్వారా సమర్థవంతంగా పనిచేయగలిగితే సత్ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ మేరకు నేటి సమావేశంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఈనాటి సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు” అని భట్టి విక్రమార్క వివరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech