- కేసు నమోదు, ఇద్దరు నిందితుల రిమాండ్.
- ఎస్పీ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశం లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
సూర్యాపేట ముద్ర ప్రతినిధి :- ఆదివారం తెల్లవారుజామున నమ్మదగిన సమాచారంతో పట్టణ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సూర్యపేట పట్టణంలోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా, రెండు ఆటోలు అనుమానస్పదంగా వస్తుండగా వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. రెండు ఆటోలలో ప్రభుత్వము నిషేదించినటువంటి గుట్కా, ఖైనీ, టొబాకో ప్యాకెట్లకు సంబందించిన బస్తాలు ఉన్నాయని, అట్టి వాహనాలతో పాటుగా, కూరగాయల మార్కెట్ నందు గల మంజు కిరణము, బేకరీ షాపు వద్దకు వెళ్లి, షాప్ నందు తనిఖీ చేశామని చెప్పారు. ఆ షాప్ వెనకాల ఏర్పాటు చేసిన గది నందు 6 లక్షల విలువగల గుట్కా, ఖైనీ, టొబాకో బస్తాలు ఉన్నవని, అట్టివాటిని పట్టుకుని, షాప్ ఓనర్ అయిన మాయదేవర శివసత్తిని విచారించామన్నారు.
గత కొంతకాలముగా కర్ణాటక ప్రాంతములో నుండి గుట్కా, ఖైని, టొబాకో లను కొనుగోలుచేసి, అట్టివాటిని సూర్యాపేట పట్టణముకి తీసుకవచ్చి, అతని షాప్ నందు ఉంచి, షాప్ వద్దకు వచ్చే కస్టమర్లకు అమ్ముతు డబ్బులు సంపాదిస్తున్నాడని గుర్తించిన నేరం సంఖ్య 331/2024 U/S 331/2024 U/S (B823 UNS/S ) & Sec 24(i) of COTP Act-2003 of Suryapet II Town PS ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వ్యాపారి శివసత్తితో పాటు పెన్ పహాడ్ మండలం భక్తుల పురానికి చెందిన ఆటో డ్రైవర్ యర్రంశెట్టి నవీన్, పై కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్ కు తరలించామని, మొత్తం 11 లక్షల విలువైన గుట్కా సీజ్, 2 వాహనాల సీజ్ జరిగింది.
గుట్కా, ఖైనీ, టొబాకోలు తినటము వలన ప్రజలకు అనారోగ్యము కలుగుతుందని, ఆరోగ్యానికి హాని కలిగించే విషయము వ్యాపారి శివసత్తికి తెలిసి ఇట్టి వ్యాపారము చేస్తున్నట్లు చెప్పగా, అతని షాప్ నందు ఉన్న గుట్కా, ఖైనీ, టొబాకో బస్తాలను, అలాగే రెండు ఆటోలను స్వాధీన పరుచుకున్నామని చెప్పారు. ఎవరైనా వ్యాపారులు ప్రజలకు అనారోగ్యము కలిగించే గుట్కా, ఖైనీ, టొబాకోలను అమ్మినచో వారిపై చట్టరిత్యా తగుచర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అక్రమ వ్యాపారులపై పోలీసులకు సమాచారం అందించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తి చేశారు.ఈ కేసును చేదించిన సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్. రాజశేఖర్ ని, ఎస్సై ఎల్. మహేంద్రనాథ్ ని, వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్‌పి రవి, స్టేబుల్ సాయిలు ఉన్నారు.