29
- నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు చిలువేరు శేఖర్
భూదాన్ పోచంపల్లి, ముద్ర; అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు భువనగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చిలువేరు శేఖర్ అన్నారు. సోమవారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రానికి చెందిన చింతకింది కిరణ్, కల్కూరి శ్రీకాంత్, సిద్దుల ప్రభాకర్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిలువేరు శేఖర్ మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని నేడు హైదరాబాదులో తలపెట్టిన ధర్నాకు వెళ్లకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి నిరుద్యోగులు నమ్మిన నిరుద్యోగుల బతుకులు మారడం లేదని, నేటికీ ఆత్మహత్యాయత్నానికి నిరసన వ్యక్తం చేశారు.