Home తెలంగాణ పండ్ల తోటలను సందర్శించిన సంగారెడ్డి ఫల పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

పండ్ల తోటలను సందర్శించిన సంగారెడ్డి ఫల పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
పండ్ల తోటలను సందర్శించిన సంగారెడ్డి ఫల పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త సుచిత్ర - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పండ్ల అధిక దిగిబడులు తోటలు ఇవ్వడానికి యాజమాన్య పద్ధతులు వివరించిన శాస్త్రవేత్త
  • మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నేరేడు తోటను పరిశీలించిన శాస్త్రవేత్త

తుంగతుర్తి ముద్ర:-పలు రకాల పండ్ల తోటలలో సస్యరక్షణ యాజమాన్య సంస్థలను ఎలా అవలంబించాలో ఉద్యానవన శాఖ ఫల పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర తుంగతుర్తి మండలిని నేరేడు తోటను సందర్శించి రైతులకు వివరించారు. తుంగతుర్తి మండల కేంద్రాన్ని మాజీ మంత్రి వ్యవసాయ రంగంలో ఆరితేరిన రైతు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నేరేడు తోటను సందర్శించిన సందర్భంగా శాస్త్రవేత్త సుచిత్ర మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బహడోలి అనే నేరేడు పండ్ల రకాల్లో పండ్ల దిగుబడిని పెంచడానికి తీసుకోవలసిన బ్రూనింగ్ చర్యలు రింగింగ్ టెక్నిక్ విధానం సస్యరక్షణ చర్యల యాజమాన్య యాజమాన్య విధానాన్ని వివరించారు. రింగింగ్ పద్ధతిని పూత రావడానికి మూడు నెలల ముందుగా అనగా సెప్టెంబర్ నెలలో మూడవ కొమ్మ పైన రింగింగ్ పద్ధతి ఆచరించాలని తెలిపారు. 15 రోజుల వరకు రింగింగ్ చేసిన నత్రజని మందులు వాడరాదని తెలిపారు. ప్రతి చెట్టుకి గాలి, వెలుతురు సమానంగా అందేలా గొడుగు కొమ్మను, బాగా అల్లుకుపోయిన కొమ్మలను జులై నెలలో ప్రూనింగ్ చేసుకోవాలని అన్నారు. పూత బాగా రావడానికి రింగింగ్ పద్ధతితో పాటు లైట్ ప్రూనింగ్ చేసుకోవాలని నిటారుగా పెరిగే నీటి కొమ్మలను తొలగించాలనీ చెట్టుకి 50 కిలోల పశువుల ఎరువు వేయాలని అన్నారు. మామిడిలో అధిక పూత రావడానికి ఆగస్టు నెలలో టిప్ ప్రోనింగ్ చేసుకోవాలని అన్నారు. లేత ఆకులు వస్తున్న దశలో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఐదు గ్రాములు లీటరు కలిపి పిచికారి చేయవలసి ఉంది. పూత పిందె సమయంలో పొటాష్ మందులు వాడాలని అన్నారు.

ఆయిల్ పాములో సమతుల మందుల యాజమాన్యాన్ని ఆచరించాలని. కొమ్ము పురుగు నివారణకు బకెట్ ట్రాప్స్ ఎకరానికి రెండు చొప్పున ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి నెల రోజులకు ఒకసారి లామ్డా సైహలోత్రిన్ 1 ఎం.ఎల్ మరియు భావిస్టిన్ ఒక గ్రా లీటర్ నీరు కలిపి ఆయిల్ ఫామ్ మొవ్వు బాగా తడిచేలాగా పిచికారిని వివరించాడు. ఈ సందర్శనలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి , జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య , తుంగతుర్తి డివిజన్ ఉద్యాన అధికారి వి.స్రవంతి, సూర్యాపేట సాంకేతిక ఉద్యాన అధికారి కే జగన్, రైతులు రామ్మూర్తి ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech