Home తెలంగాణ కొత్త డాక్టర్లొచ్చేనా – కష్టాలు తీరేనా ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కొత్త డాక్టర్లొచ్చేనా – కష్టాలు తీరేనా ? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కొత్త డాక్టర్లొచ్చేనా - కష్టాలు తీరేనా ? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఉండాల్సింది 16 మంది – ఉన్నది ముగ్గురే
  • మత్తు డాక్టర్ లేక – ఆపరేషన్లు ఆపలేక

ముద్ర ప్రతినిధి,కోదాడ:- కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో వివిధ విభాగాలకు చెందిన 16 మంది డాక్టర్లు ప్రస్తుతం కేవలం ముగ్గురు డాక్టర్లు మాత్రమే రెగ్యులర్ డాక్టర్లున్నారు . ఒకరు డిప్యుటేషన్ పై రాగా , మరో ఇద్దరు కాంట్రాక్ట్ ప్రతిపాదికన వైద్య సేవలు అందించారు . ప్రస్తుతం వైద్యశాలలో ఉన్న ముగ్గురు రెగ్యులర్ డాక్టర్లలో ఒకరు గైనిక్ , ఒకరు పీడియాట్రిక్ , ఒకరు ఎంబిబిఎస్ (జనరల్ డ్యూటీ మెడికల్ డాక్టర్) ఉండగా , హుజూర్ నగర్ నుండి డిప్యుటేషన్ పై వచ్చిన సర్జన్ విధులు నిర్వహిస్తున్నారు , ప్రస్తుతం ఇతనే వైద్యశాలకు ఇంచార్జ్ సూపరిండెంట్ గా కూడా విధులు నిర్వహిస్తున్నారు . ఇక కాంట్రాక్ట్ బేస్ లో ఒక గైనిక్ , ఒక సర్జన్ ను నియమించారు . ప్రస్తుత వైద్య శాఖలో బదిలీలు జరుగుతున్నందున కొత్త డాక్టర్ల నియామకం జరగాలని , రోగులకు మరిన్ని సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అన్ని విభాగాలకు ప్రభుత్వం నియమించాలని , అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు.

మత్తు డాక్టర్ లేక – ఆపరేషన్ ఆపలేక

ప్రస్తుతం వైద్యశాలకు రెగ్యులర్ మత్తు డాక్టర్ లేకపోవడం హుజూర్ నగర్ వైద్యశాల డాక్టర్ నే కోదాడ వైద్యశాలకు కూడా డిప్యుటేషన్ కేటాయించడంతో అత్యవసర సమయం లో సర్జన్ డాక్టర్లు అనేక అవస్థలు పడాల్సి వస్తుంది . దీనితో ఒక్కొక్కసారి కొన్ని ఆపరేషన్లను మరుసటి రోజుకు వాయిదా వేసేటప్పుడు , ఎమర్జెన్సీ సమయాలలో మాత్రం డబ్బులు చెల్లించి ప్రయివేట్ డాక్టర్ ను పిలుస్తున్నారు . ప్రయివేట్ మత్తు డాక్టర్ కు ఒక్కొక్క ఆపరేషన్ కు 1500 రూపాయల వరకు డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం .

ఈ బాధలు తొలగాలంటే ఇప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియలో కోదాడ వైద్యశాలకు మత్తు డాక్టర్ ను నియమిత ప్రతిపాదికన నియమించాల్సిన అవసరం ఉంది . అలాగే వైద్యశాలకు ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ కూడా చాలా అవసరం . కోదాడ పరిసరాలలో ఎన్ ఎచ్ 65 పై యాక్సిడెంట్లు జరిగితే ఆ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొస్తారు . ఇక్కడ ఎక్కువగా పోస్ట్ మార్టం లు జరుగుతాయి కాబట్టి జనరల్ డాక్టర్ కాకుండా ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఈ పోస్టును కూడా భర్తీ చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ఇక ముఖ్యంగా వైద్యశాలలో జనరల్ ఎండి డాక్టర్ చాలా అవసరం ఉందని జ్వరాలు , ఇతర సీజనల్ వ్యాధుల పేషంట్లు అధికంగా వస్తుంటారని డాక్టర్ అవసరం ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు .

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech