ముద్ర ,తుర్కపల్లి : కన్నా కూతురే తల్లిదండ్రులని మోసం చేసిన హృదయ విదారకమైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమర్రి ప్రధానోపాధ్యాయురాలుగా చదివిన పత్తి బాలమణి తమ తల్లిదండ్రులను మోసం చేసిన ఘటన ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన పత్తి మల్లయ్య శివమ్మ వృద్ధ దంపతులు మంగళవారం తుర్కపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కన్నా కూతుర్ని నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయురాలుగా వాసాలమర్రిలో వీధులు నిర్వహిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం మేము మా కూతురితో కలిసి తిరుపతికి వెళుతున్న సమయంలో మా దగ్గర దాచుకున్న 30 తులాల బంగారాన్ని ఆమెలాఖరులు దాచిపెట్టి తిరుపతికి వెళ్ళాము వచ్చిన తరువాత తమ బంగారం తమకు ఇవ్వకుండా కన్న తల్లిదండ్రులైన మమ్మల్ని నానా బాధలకు గురి చేస్తుందని అన్నారు.
బంగారం ఇవ్వమని అడిగినచో మాకు ఇవ్వకుండా బాధలు పెట్టడంతో మేము మా కూతురుపై తేదీ: 18 ,6, 2024 రోజున మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము. పోలీస్ స్టేషన్లో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాని పెంచిన కూతురే మోసం చేయడంతో మేము దిక్కు తోచని స్థితిలో ఉన్నామని నేను రైల్వేలో చిన్నపాటి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను ఆ వచ్చే పెన్షన్ బతుకుతున్నాను. నా కూతురు నాకు బంగారం ఇవ్వకుండా బాధలకు గురి చేయడం ఎంతవరకు న్యాయమని నలుగురు పెద్దల సమక్షంలో అడిగినా కూడా ఆమె మా బంగారం మాకు ఇవ్వడం లేదు ఉన్నత అధికారులు వృధా దంపతులకు గోడును విని ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము దేశంలో మాలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు పుట్టిందని ఇలాంటి బాధ వేరే వాళ్లకు రావద్దని కోరుకుంటున్నామని మనోవేదన వ్యక్తం చేశారు. చేస్తున్నట్టు చెప్పారు .