సినిమాల్లో శత్రువులను మట్టి కరిపించే హీరో, తన యాక్షన్ సీక్వెన్స్‌ల ద్వారా మాస్ ఆడియన్స్‌తో ఈలలు వేయించుకునే హీరో ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. నాలుగు నెలల క్రితం రేణుకా స్వామి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ హీరో చేసిన పని కన్నడ స్టార్ హీరో దర్శన్ చేశాడు. తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత మార్చాడు. తను పాన్ ఇండియా మూవీస్ చెయ్యకపోయినా కర్ణాటకలో దర్శన్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అక్కడ ఏ హీరోకీ లేనంత అభిమానగణం అతనికి ఉంది. అంత పాపులరిటీ ఉన్న హీరో కేవలం ఒక అమ్మాయి కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.
సినిమాల్లో శత్రువుల పాలిట సింహస్వప్నంగా ఉండే దర్శనం నిజ జీవితంలో భయంతో వణికిపోతున్నాడు. అది కూడా ఒక ఆత్మ వల్ల. సాధారణంగా జైలు జీవితాన్ని గడిపే వారు భార్య, పిల్లల గురించి, కుటుంబ సభ్యుల గురించి ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ, దర్శన్ మాత్రం ఒక ఆత్మ వల్ల వేధించబడుతున్నాడట. కొన్ని రోజులుగా నిద్రకు దూరమవుతున్నానని, రేణుకా స్వామి ఆత్మ తనను వేధిస్తున్నదని జైలు అధికారులతో మొరపెట్టుకుంటున్నాడు. ప్రతిరోజూ రాత్రి కలలోకి అతని ఆత్మ వస్తోందని, ఒంటరిగా ఉండలేకపోతున్నానని చెబుతున్నాడు. తనని వేరే జైలుకి తరలించాలని కోరుతున్నాడు దర్శనం. అర్థరాత్రి సమయంలో నిద్రలో దర్శనం పెద్దగా కేకలు వేస్తున్నట్లు తోటి ఖైదీలు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దర్శన్‌కి బెయిల్ తెప్పించేందుకు ఆయన భార్య విజయలక్ష్మీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.