Home తెలంగాణ ఏఐటీయూసీ పోరాటాల పలితంగా పెరిగిన హాస్పిటల్ కార్మికుల వేతనాలు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఏఐటీయూసీ పోరాటాల పలితంగా పెరిగిన హాస్పిటల్ కార్మికుల వేతనాలు.. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఏఐటీయూసీ పోరాటాల పలితంగా పెరిగిన హాస్పిటల్ కార్మికుల వేతనాలు.. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • జీవో నియో.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని నిరవధిక సమ్మె..
  • ఉదయం నుండి జిల్లా హాస్పిటల్ లో నిలిచిపోయిన పారిశుధ్య పనులు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి జిల్లా హాస్పిటల్‌లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్స్, పేషెంట్ కేర్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న 3 నెలల జీతం వెంటనే అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని పెండింగ్‌లో ఉన్న 3నెలల వేతనం చెల్లించాలని శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు తమ విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేశారు.

సమ్మెకు సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మద్దత్తు తెలిపి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2022 జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం కొత్త వేతనాలను ఆసుపత్రి కార్మికులు అందుకుంటున్నారని కానీ భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మాత్రం అమలు చేయడం లేదని జిల్లా కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినందున కార్మికులు ఏటీయూసీ ఆధ్వర్యాన నేటి నుండి నిరవధిక సమ్మె ఆసుపత్రి కార్మికుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు.

ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా పెరిగిన వేతనాలు, సమ్మె విరమించిన కార్మికులు ఏఐటీయూసీ పోరాటాల ఫలితంగా మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెరిగాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు. జిల్లా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించి నేటి నుంచి నిరవధిక సమ్మె సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఏవో మసూద్, టీవీటీ ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రతినిధి శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్ కార్మికులతో కలిసి చర్చలు జరిపారు.

ఈ చర్చలలో కార్మికుల వేతనాలు 10,500కు పెంచుతామని, 3నెలల పెండింగ్ జీతాలు వెంటనే అందజేస్తామని, అందరికీ ఈఎస్‌ఐ పిఎఫ్ సక్రమంగా చెల్లిస్తామని, 3 షిఫ్ట్ ల ప్రక్రియ అమలులో ఉందని, వేతనాలు ప్రతి నెల 5వ తేదీన చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేసే వరకు భవిష్యత్తులో ఉద్యమాలు నిర్వహిస్తామని ఇమ్రాన్ తెలిపారు.

సమ్మెకు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, శానిటేషన్ కార్మికులు మేడబోయిన లక్ష్మి, గుండు వాణి, జేరిపోతుల కమలమ్మ, ఇస్తారమ్మ, సులోచన, నరసింహ, సోమనరసయ్య, కృష్ణ, సుగుణ, కృష్ణవేణి, లావణ్య, లలిత, భారతమ్మ, మలహేత, మహేందర్ , స్వప్న, బాలరాజ్, నాగరాణి, లలిత, కిరణ్, విజయలక్ష్మి, రేణుక, శేఖర్, సంతోష్ ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech