భూదాన్ పోచంపల్లి, ముద్ర; అక్కలను నమ్మి మోసపోయానంటూ బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రాన్ని నేతాజీ చౌరస్తాలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక స్థానం, గౌరవం ఉందన్న కనీస స్థాయి ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమయితావంటూ ,జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు. తక్షణమే అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, పీఈఎస్‌ఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు కుడికాల బలరాం, దేవరాయ కుమార్, నాయకులు నోములంటి మాధవరెడ్డి, గునిగ మల్లేష్ గౌడ్, చేరాల నరసింహ జరిగింది.