- మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన
- సీఎం ఛాంబర్ ముందు బైఠాయించిన ఎమ్మెల్యేలు
- బయటికి పంపిన మార్షల్స్.. అసెంబ్లీ వాయిదా
- కేటీఆర్ పై రేవంత్ హాట్ కామెంట్స్
- సొంత చెల్లెల్ని జైల్లో పెట్టిన బీజేపీతో రాజకీయ ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్య
- సీతక్కను అవమానించేలా మిమ్స్ పెడుతున్నరని ఆవేదన
- మెట్రో సిటీ, స్కిల్ యూనివర్సిటీ, సివిల్ కోర్టుల చట్ట సవరణ, ఇతర బిల్లులపై చర్చ
ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల వాగ్వాదంతో అసెంబ్లీ అట్టుడుతోంది. గురువారం కూడా కీలకమైన పార్టీ నేతల వాగ్వాదంతో చర్చ పక్కదారి పట్టింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పరస్పర విమర్శలు, ఆందోళనల మధ్య కొనసాగుతున్న సభ.. కీలక అంశాలపై చర్చ జరగకుండానే వాయిదా పడింది.
హరీశ్‌రావుపై మండిపడ్డ స్పీకర్..
ఉదయం 10 గంటలకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ మొదలైన వెంటనే.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీనితో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ముందుగా తాము మాట్లాడుతామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సభలో గళమెత్తారు. దీంతో హరీశ్ రావుపై మండిపడ్డ స్పీకర్.. అనుచిత, అప్రజాస్వామిక పద్ధతిలో తనపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అయినా శాంతించని బీఆర్ఎస్ నేతలు నిరసన అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎం రేవంత్ కూడా స్పందించారు. అంశాలవారీగా చర్చల్లో ప్రతిపక్షం పాల్గొనాలని సూచించారు. ప్రతిపక్షం ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావట్లేదు.
సీఎం ఛాంబర్ ముందు ఎమ్మెల్యేల బైఠాయింపు..
సభ కొనసాగుతుండగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన చేపట్టారు. బాధిత మహిళా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అని బైల్ జాదవ్, పల్లా రాజేశ్వర్‌ఠాంబర్‌తో పాటు పలు సభ్యులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ కొనసాగింది. దీంతో ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు పంపించారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో బైఠాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అక్కడ నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుపై కనిపించింది. తర్వాత అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని తెలంగాణ భవన్‌కు పరిశీలించారు.
నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి..
ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గురువారం మహిళా శాసనసభకు నల్ల బ్యాడ్జీలతో వచ్చారు. అదే సమయంలో స్పీకర్ సైతం నల్ల డ్రెస్‌తో రావడంతో తమకు మద్దతుగా నల్ల డ్రస్‌తో వచ్చిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని హరీశ్‌రావు తెలిపారు. కాగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల తీరుపై బీజేపీ, సీపీఐ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు హైదరాబాద్ మెట్రో సిటీ సుస్థిర పట్టణాభివృద్ధి, సివిల్ కోర్టుల చట్ట సవరణ, తెలంగాణ చట్టాల బిల్లులపై స్వల్పంగా జరిగింది.
చెల్లెను జైల్లో పెట్టిన బీజేపీతో దోస్తీయా..?
బీఆర్ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. సబిత, సునీతను సొంత అక్కలుగానే భావించానన్న సీఎం.. ఒక అక్కను నడిబజారులో వదిలేసినా ఏం అంటే. ఇంకొక అక్క కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్తే అప్పటి కేసుల్లోఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నానన్నారు. ప్రచారానికి వచ్చిన తమ్ముడిపై కేసులు ఎత్తివేయాలని ఎప్పుడైనా చెప్పారా? అని ప్రశ్నించారు. మరోవైపు లిక్కర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న సొంత చెల్లె.. కల్వకుంట్ల కవితను బీజేపీ సర్కార్ జైల్లో పెట్టిన ఢిల్లీకి రాజకీయ ఒప్పందం చేసుకున్న నీచులు అని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాంటి వాళ్ల ఉచ్చులో పదోద్దని ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలకు సూచించారు.
ఆదివాసీ ఆడబిడ్డను అవమానిస్తారా..?
సబిత, సునీత కోసం కొట్లాడింది తాను అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మహిళలను తను గౌరవిస్తానని, తనను నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందువరుసలో ఉన్నారని చెప్పారు. ఆ తమ్ముడిని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. సీతక్కను అవమానించేలా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టడమేనా మీ నీతి అని బీఆర్ఎస్ ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ ఆడబిడ్డను అవమానించవచ్చా అని ఉంది. బీఆర్‌ఎస్ రాజకీయ పాచికతో సభను స్తంభింపజేస్తుందని, అక్కలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని సీఎం ప్రకటించారు. ప్రతిపక్షపార్టీ సభ్యులు పంట ఋణమాఫీని దెబ్బ తీసి స్కిల్ వర్సిటీ ఆలోచనను అడ్డుకునేందుకు యత్నించారని. నేరళ్ల దళితులను కరెంట్ షాకులతో హింసించారని బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మీరాకుమారిని విమానాశ్రయంలో అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుబాటులో 17 కోర్సులు : సీఎం రేవంత్ రెడ్డి
యువత సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేటి యువత డిగ్రీ పట్టాలు తీసుకుంటున్నారు కానీ నైపుణ్యాల లేమితో ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో మాట్లాడిన ఆయన విద్యార్థుల కోసం 17 కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. వృత్తి నైపుణ్యం లేకపోవడంతో పట్టాలు ఉన్నా ఉద్యోగాలు దొరకలేదన్న రేవంత్.. దేశానికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో స్కిల్ వర్సిటీ రూపకల్పన చేసినట్టు తెలిపారు. ఏడాదికి రూ.50వేల నామ మాత్రపు ఫీజుతో కోర్సుల శిక్షణ అందిస్తామని సీఎం చెప్పారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ ఏడాది 6 కోర్సులకు రెండువేల మందికి అడ్మిషన్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయన్న ఆయన భవిష్యత్ జిల్లాల్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ఆలోచన అందించబడింది.
ఇది కౌరవ సభ : ఎమ్మెల్యే హరీశ్ రావు
అసెంబ్లీ కౌరవుల సభలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఉన్నారు. అంతిమంగా గెలిచేది పాండవులని, నిలిచేది పాండవులే అని. అధికారం పక్షం అహంకారంతో చేస్తున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. శాసనసభలో విపక్షం గొంతునొక్కారని ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు కోరినా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆకాంక్షలు లేవని, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు శాసనసభలో చూడడం దురదృష్టకరమన్నారు. నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది.
క్షమాపణ చెప్పేంత వరకు విడిచిపెట్టం : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డి ముమ్మూటికీ తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఆయన్ను విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. మరోవైపు శాసనసభలో మూడుగంటలుగా నిల్చొని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగుతుందని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
స్కిల్ వర్సిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
స్కిల్ వర్సిటీ ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తున్నట్లు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా స్కిల్ వర్సిటీలను ప్రోత్సహిస్తుంది. జిల్లాల్లో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వం యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి కోసం రూ.12లక్షలు ఇచ్చారు.
యువతకు ఉపాధి అవకాశాలు : మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడం, ప్రైవేటు యువతకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముచ్చెర్లలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ఏర్పాటు చేసింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీన్ని అన్ని రాజకీయపక్షాలు స్వాగతించాలని. యువత భవిష్యత్ మార్పునకు స్కిల్ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ పై జరిగిన చర్చలో మంత్రి కోమటిరెడ్డి వివరాలు ఇచ్చారు. బీటెక్, పాలిటెక్నిక్ పూర్తిచేసిన యువత నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్న గత ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.