- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
- ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్య సిబ్బంది సూచనలను పాటించాలి
- మురికి నీరు,చెత్తాచెదారం నిల్వ ఉండరాదు
ముద్ర,పానుగల్:-సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి,ఎంపీడీవో గోవిందరావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం డ్రై,ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పానుగల్ వారి బహుదూర్ గూడెం,కేతేపల్లి,నిజామాబాద్ గ్రామాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విషజ్వరాల బారిన పడకముందే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వానాకాలం ముసురు పట్టకముందే ప్రజలు పారిశుధ్యాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని,రోడ్ల పై,ఇంటి ఆవరణలో పేరుకుపోయిన చెత్తచెదారం మురుగునీళ్ల వల్ల దోమలు కుప్పలు తెప్పలుగా వృద్ధి చెందుతాయి. చర్యల్లో భాగంగా తాజాగా ఇంటిటి జ్వరసర్వే చేయడం జరుగుతోందని అన్నారు.ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ మొక్కలకుండీలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాతటైర్లు, పాడైన కూలర్లు, త్రాగి పడేసినకొబ్బరి బోండాలు పాతరుబ్బు రోళ్లు వీటిలో నీరు నిలిచేఅవకాశం ఉండటం వల్ల నివాస ప్రాంతాల నుండి తొలగించాలని, లేకుంటే ఖాళీ స్థలాలు రోడ్ల ప్రాక్టికల్స్ ఘనపదార్థాలు గుట్టలుగా పోయాయి. భరించలేని దుర్గంధం వెలువడుతుందని, దీని వలన దోమలు, ఈగలు సైరవిహారం చేస్తూప్రమాదకర వ్యాధులను వ్యాపింపజేస్తాయి.నిల్వ నీటి తొట్లలోని నీటిని వారానికి ఒకసారి పారబోయాలని,నీటిని కాచి చల్లారిన తర్వాత వంటినీ, లేదంటే త్రాగేనీరు కలుషితమై డైయేరియా, టైఫాయిడ్, రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున వాతావరణంలోకి ప్రవేశించడం వల్ల మంచి వాతావరణం ఏర్పడుతుంది. జలుబు,జ్వరం,గొంతునొప్పి,శరీరనొప్పులు,కండ్లకలక,శ్వాసకోశఇన్ఫెక్షన్,న్యూమోనియా,క్షయ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువ అందుకే బయట ఆహారం తినడం మానుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామయ్య,హెల్త్ అసిస్టెంట్ లు రామచందర్,శ్రీలక్ష్మి,రఘురావు కార్యకర్తలు,గ్రామపంచాయతీ కార్యదర్శి , చినమ్మ,ప్రమీల గ్రామ పెద్దలు ఉన్నారు.