ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల మేర పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం సచివాలయంలో ఈనెల 4 నుంచి 11 వరకు జరగనున్న అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి సమావేశాలు, కార్యక్రమాలను అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ కు సంబంధించి సుమారు రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఒప్పందాలు చోటు చేసుకునే అవకాశం. ఈ ఒప్పందాలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి గణనీయ ప్రోత్సాహాన్ని అందించాయి. నూతన ఆవిష్కరణలు, పెట్టుబడుల ప్రవాహంతో రాష్ట్రం పటిష్ట ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార, పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక కార్యక్రమాలు తెలంగాణను ప్రధాన గమ్యస్థానంగా నిలబెడుతున్నాయని. నూతన పెట్టుబడుల వలన రాష్ట్రంలో వేలాది కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చారు.