Home తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపాలి...



  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పోరాటం
  • న్యాయ పోరాటం మొదలుపెట్టాం
  • సుప్రీం కోర్టులో పిటిషన్
  • ఢిల్లీలో న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చలు

ముద్ర, తెలంగాణ బ్యూరో:-పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ప్రముఖ న్యాయ నిపుణులతో సోమవారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపారు. అటు రాజ్యాంగ నిపుణులతోనూ పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైంది.

ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించిన ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు చెట్పట్ ఆర్యమా సుందరం పార్టీ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగానే అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ కాలం నాంచలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్‌ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం త్వరలో హైకోర్టు నిర్ణయం.

న్యాయ పోరాటం చేస్తాం..

సుప్రీంకోర్టు తీర్పుతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగుతుందని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతామన్నారు.

ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech