- రూ. 3 వేల నుంచి రూ. 20 వరకు ప్రత్యేక నిధులు
- విద్యార్థుల సంఖ్యను బట్టి కేటాయింపులు
- పాఠశాల నిధులకు అదనంగా గ్రాంట్
- ఉపాధ్యాయ సంఘాలు హర్షం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భాగంగా భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల పరిశుభ్రత కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం ఈ గ్రాంట్ ను అందించింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల నిధులతో పాటు ఈ గ్రాంట్ ను కేటాయించినట్లు తెలిపారు. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి అప్పగించింది.
పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్ ను కేటాయించింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంట్ మంజారు చేశారు. దీని ప్రకారం 30మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.3వేలు గ్రాంటుగా ఇవ్వనున్నారు. అలాగే, 31 నుంచి 100మంది విద్యార్థుల పాఠశాలలకు రూ.6వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.8వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులుంటే రూ.12వేలు, 501 నుంచి 750 మంది ఉంటే 15వేలు, 750 మంది విద్యార్థులకు పాఠశాలకు రూ.20వేలు చొప్పున గ్రాంటుగా ఇవ్వనున్నారు. మొత్తం పది నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేయనుంది.
ఉపాధ్యాయ సంఘాలు హర్షం …
స్కూల్ ఫెసిలిటీ మెయింటినెన్స్ గ్రాంట్ పేరుతో పాఠశాలల్లో శుధ్యం నిర్వహించేందుకు, మొక్కల సంరక్షణకు విద్యార్థుల సంఖ్య ప్రకారం రూ. 3000 నుంచి రూ. 20000 వరకు నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్బంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె. జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగేళ్ళుగా పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని వారు తెలిపారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అప్పగించింది 90% పంచాయతీల్లో అమలు జరగడానికి సహాయం.
ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రాతినిథ్యం వహించి ఆందోళనలు నిర్వహించలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్ళిన వెంటనే సానుకూలంగా స్పందించారు. ఇదిలావుండగా, పదదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ఇటీవల నిర్వహించిన ముఖా ముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రిని పాఠశాలల్లో పరిశుభ్రత కోసం విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాల సౌకర్యాల నిర్వహణ గ్రాంట్ ఇవ్వడం ద్వారా ఉత్తర్వులు జారీ చేయటం పట్ల ఎస్టీ టియస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు యం. పర్వత్ రెడ్డి, జి. సదానందం గౌడ్‌లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.