- 22 క్రస్ట్ ల్గేట్ల ఎత్తివేత
ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ జలకళను సంతరించుకుంది. శ్రీశైలం నుంచి ఆ జలశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యాం అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీకాలు కాగా ప్రస్తుతం 298 టీఎంసీలుగా ఉన్నాయి.
జలాశయానికి ఇన్‌ఫ్లో 3,41,990 క్యూసెక్కుల నీరు వస్తోంది. సాగర్ క్రస్ట్ గేట్లలో 16 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, మరో నాలుగు గేట్లను ఐదు అడుగుల మేర లిఫ్ట్ చేసి స్పిల్‌వే ద్వారా రెండు లక్షల 55వేల 296 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. సాగర్ ఔట్‌ఫ్లో 3,41,990 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశయం కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతుంది. మరొక ఆరు గేట్లను వరద ప్రవాహాన్ని బట్టి ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు.