- విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బండారి రమేష్
- హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సామూహిక ర్యాలీ
ముద్ర/షాద్ నగర్: బంగ్లాదేశ్ లో హింసాకాండ జరుగు తున్న నేపథ్యంలో అక్కడి హిందువులకు భద్రత కల్పించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకుడు బం దారి రమేష్ చెప్పారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి పట్టణ ముఖ్య కూడలి మీదుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు సామూహిక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండారి రమేష్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్యని ఆయన అన్నారు.
హిందూ ఆలయాలు, గురుద్వారాలు దుకాణాలు, హిందూ శ్మశాన వాటికలు ధ్వంసం చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు 32 శాతం ఉన్న హిందువులు నేడు 8 శాతం తక్కువగా ఉన్నట్లయితే ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న హింసకాండ ఏ విధంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత, మానవ హక్కుల పరిరక్షణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగు తున్న హింసాకాండను నిరసిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిర్వహించారు.