- రిమాండ్ కి నిందితుడు – ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్పీ జానకి షర్మిల సోమవారం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన కొసిడిగ సాయికుమార్ బుధవారం రాత్రి సమయం లో అమ్మవారి దేవస్థానం లోకి చొరబడి హండి పగులకొట్టి రూ.14,200 దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ముధోల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, బాసర పోలీసు ఎస్‌ఐ గణేష్, మోహన్ సింగ్ కానిస్టేబుల్ సహా పలువురు పోలీసు సిబ్బందితో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు.
సీసీటీవీ ఫుటేజ్ పోలీసు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో దొంగను గుర్తించినట్లు వివరించారు. అదే వ్యక్తి ఆదివారం కూడా బాసర ఆలయ పరిసరాల్లో సంచరిస్తుండగా బాసర పోలీసులు పట్టుకొని, సీసీ ఫుటేజ్‌లో ఉన్న వ్యక్తి పోలికలు ఉండటంతో పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. నిందితుడు నేరాన్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన డబ్బులో రూ.6400విలువైన ఫోన్, రూ.600 నగదు, నిందితుడు వాడిన బైక్, హుండీ పగుల కొట్టేందుకు వాడిన రాయి స్వాధీనపరచుకున్నామని తెలిపారు.
భద్రతా లోపాలపై ఈ ఓ తో మాట్లాడాం:ఎస్పీ
భద్రతాపరమైన లోపాల మీద మాట్లాడుతూ దేవస్థానం లో భద్రతాపరమైన విషయంలో ఎటువంటి లోపాన్ని ఉపేక్షించకూడదని తెలిపారు. దేవస్థానాన్ని సందర్శించినప్పుడు చాలా లోపాలను గుర్తించామని అన్నారు. ప్రధానంగా దేవస్థానం చుట్టూ చాల ప్రదేశాలలో సీటీవీ లు లేవన్నారు. ఈ కేసును చేదించటంలో ప్రత్యేక చొరవ తీసుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్, కానిస్టేబుల్ మోహన్ సింగ్ లను ఎస్పీ ప్రశంసించారు.