Home తెలంగాణ నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌పై వివాదం ఏంటంటే? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌పై వివాదం ఏంటంటే? – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌పై వివాదం ఏంటంటే? - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఇందులో బిగ్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. టాలీవుడ్‌కు చెందిన ఎన్నో ఈవెంట్‌లతో పాటు బడా కుటుంబాల పెళ్లిళ్లు కూడా ఈ ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగాయి. అలాంటి ఈ ఎన్-కన్వెన్షన్ వివాదంలో చిక్కుకుంది. ఇది అక్రమ నిర్మాణమంటూ గతంలోనూ ఎన్నో అరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి.

2014లో కేసీఆర్ ప్రభుత్వం సర్వే చేసి.. ఎన్‌-కన్వెన్షన్‌ FTLలో నిర్మించారని తేల్చింది. అయినా.. మిగతా నిర్మాణాలను కూల్చిన అధికారులు.. ఈ కన్వెన్షన్ సెంటర్ జోలికి మాత్రం వెళ్ళలేదు. తాజాగా అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటికే నగరంలో పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. ఎవరివైనా వదిలే ప్రసక్తే లేదని, అక్రమ నిర్మాణమని తేలితే కూల్చేస్తామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

ఈ కోసం ఎన్-కన్వెన్షన్ పై మరోసారి ఫిర్యాదు చేశారు. తుమ్మిడి హడ్డి చెరువులో మూడున్నర ఎకరాల కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ నిర్మించారని ఫిర్యాదులు రావడంతో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం ఆరు భారీ యంత్రాలతో కన్వెన్షన్‌ కూల్చివేశారు అధికారులు. ఎన్-కన్వెన్షన్కు వెళ్లే దారులంటిని మూసివేసి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు.. నేలమట్టం చేశారు.

కాగా, నల్లా ప్రీతంరెడ్డితో కలిసి నాగార్జున.. ఈ ఎన్‌-కన్వెన్షన్‌లో మొత్తం 10 ఎకరాల్లో నిర్మించారు. అందులో మూడున్నర ఎకరాల తుమ్మిడి చెరువును కబ్జా అని అధికారులు నిర్ధారించారు. ఇండెలో 1.12 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌లో.. 2 ఎకరాలు బఫర్‌ జోన్‌లో ఉందని తేల్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech