ముద్ర, ఎల్లారెడ్డి: చెరుకు పంటను అడవి జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి చిరుత మృతి చెందింది. కేసు అవుతుందేమోనని భయపడిన రైతు చిరుత కళేబరాన్ని గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఏలరెడ్డి మండలం హాజీపూర్ గ్రామపంచాతీ పరిధిలోని తండాలో చోటు చేసుకుంది.
నూద్యానాయక్ అనే రైతు పొలంలో చిరుత మృతి చెందగా, ఆయన ఈ పరిశీలన బయటికి తెలియనీయలేదు. చెరుకుతోటలోనే గొయి తవ్వి చిరుత కళేబరాన్ని పాతిపెట్టాడు. విషయం తెలుసుకున్న ఎలారెడ్డి ఫారెస్ట్ అధికారులు పాతిపెట్టిన చితరు కళేబరాన్ని బుధవారం ఉదయం వెలికి తీయించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన డివిజన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.