- ప్రమాదకరంగా మారిన రోడ్డు
ముద్ర, గంభీరావుపేట : ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్ల పేట గ్రామం నుండి గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం వరకు ఇటీవలే నూతనంగా డబల్ రోడ్డు నిర్మించగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. ఎగువ మానేరు మత్తడి దూకడంతో గంభీరావుపేట లింగన్నపేట గ్రామాల మధ్య నూతనంగా హై లెవెల్ బ్రిడ్జి నిర్మించడంతో, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు ఉద్ధృతికి కొట్టు విభాగాన్ని సిద్దిపేట, కామారెడ్డి వెళ్లే ప్రయాణికులు గంభీరావుపేట కోరుట్ల పేట,మల్లారెడ్డిపేట నుండి డ్రైవ్ చేయాల్సి వస్తుంది.
కోరుట్ల పేట,మల్లారెడ్డిపేట నుండి లింగన్నపేట గ్రామాల నుండి వెళ్లే ప్రయాణికులకు ఇటీవల నిర్మించిన డబుల్ రోడ్డు కోతులకి గురి కావడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులను బెంబేలెత్తిస్తుంది.ఏమాత్రం అదమరచి అదుపుతప్పి డ్రైవింగ్ చేస్తే ఆ రోడ్డుకి అవతల ప్రాణాలు పోవడం ఖాయం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిత్యం రహదారి వెంబడి వందలాది వాహనాలు సిద్ధిపేట నుండి కామారెడ్డి రాకపోకలు సాగుతున్నాయి, ప్రమాద భారత రహదారి నీ రిపేరు కోసం వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.