Home తెలంగాణ మరో హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మరో హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
బిగ్ అలర్ట్ - తెలంగాణలో నేటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు ... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతా వరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీ సహా తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలో ఉన్న వాయు గుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచినీ పట్నం మీదుగా వెళ్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగ్ ళాఖాతం వరకు వ్యాపించి ఉందని తెలుస్తోంది.

దీంతో.. మంగళశారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మ కొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని. ఈ విధంగా ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డి, నిజా మాబాద్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా 25.4, సదాశివనగర్ 24, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech