తెలంగాణ నుండి ఇప్పటికే పలు ప్రాంతాలకు నాలుగు వందే భారత్ రైళ్లు అందుతుండగా, మరో రైలు (ఐదో) పట్టాలపై పరుగులు పెట్టడానికి సిద్ధమైంది. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ సేవలు అవసరమైన మూహూర్తం ఫిక్సయింది. ఐదో వందేభారత్ ట్రైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15న వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ కేంద్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏర్పాటు.
ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ రెండు నగరాల మధ్య 578 దూరంలో ఉన్న దూరాన్ని కేవలం ఏడు గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ట్రైన్.. నాగ్ పూర్‌లో ఉదయం 5 గం.లకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు సికింద్రాబాద్‌లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్ పూర్ చేరుకోనుంది. కాజీపేట, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుందని తెలిపారు.
తెలంగాణ గడ్డపైనుంచి మరో వందేభారత్ రైలు ప్రారంభం. ఇప్పటికే 4 వందే భారత్ రైళ్లు సేవలందిస్తుండగా.. ఐదో వందేభారత్ రైలు ఈ నెల 15 నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్ మధ్య పరుగులు పెట్టనుంది. ప్రియతమ భారత ప్రధాని వర్చువల్గా ఈ రైలు ప్రారంభించనున్నారు.
దీనితో ఈ రెండు నగరాల మధ్యన ఉన్న… pic.twitter.com/5zthbxboXK
— జి కిషన్ రెడ్డి (@kishanreddybjp) సెప్టెంబర్ 9, 2024