నీ ఇంటికొస్తా.. నట్టింటికొస్తా.. నీ ఇంటిపైనే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా'.. ఇది కౌశిక్‌రెడ్డి సవాల్..! 'దమ్ముంటే నా ఇంటికి రా.. నువ్వో నేనో తేల్చుకుందాం'.. ఇది అరికపూడి గాంధీ ప్రతిసవాల్..! ఫిరాయింపుల ఎపిసోడ్లో నిన్న చీర-గాజులు చూపిస్తూ కౌశిక్‌రెడ్డి చేసిన వివాదస్పద వ్యాఖ్యలు అగ్గి రాజేసింది.. ఇప్పుడు అది మరింతగా భగ్గుమంది..! అరికపూడి గాంధీ అయితే.. కౌశిక్‌రెడ్డి తీరును, మాటల్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.. కౌశిక్‌రెడ్డి సవాల్‌కు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు అరికెపూడి గాంధీ.. తానేమీ చేతులు కట్టుకుని కూర్చోలేదు.. దేనికైనా సిద్ధం అంటూ ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చారు అరికెపూడి గాంధీ.. తాను సీనియర్ శాసన సభ్యుడినని.. నాపై మాట్లాడే అర్హత కౌశిక్‌రెడ్డికి.. కేసీఆర్‌కు తనకు ఎలాంటి విభేదాలు లేవని.. తాను ఎప్పుడూ గౌరవం ఇస్తానంటూ పేర్కొన్నాడు. కౌశిక్‌రెడ్డి బ్రోకర్ల వల్ల.. చాలామంది పార్టీకి దూరమయ్యారంటూ అరికెపూడి గాంధీ పైర్ అయ్యారు. 11గంటలకు నా ఇంటికి రా.. లేకపోతే 12గంటలకు నీ ఇంటికొస్తానంటూ కౌశిక్‌రెడ్డికి అరికెపూడి సవాల్ చేశారు. పోలీస్ సెక్యూరిటీ అవసరమే లేదు.. నీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందాం అంటూ గాంధీ తెలియజేసారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను భ్రష్టు పట్టిస్తున్నది కౌశిక్‌రెడ్డే.. అని.. దేనికైనా తాను సిద్ధం.. అంటూ పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డికి తనకు మధ్య జరిగే యుద్ధం ఇది చెబుతోంది.
అనంతరం మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. అరికెపూడి బ్రోకరిజం అంటూ చేశారు. ఆయన అందర్నీ అనడం కాదు.. ఆయన చరిత్ర ఏంటో చూసుకోవాలన్నారు. అయితే.. చీర, గాజుల గుర్తు డైవర్ట్ లేదని.. కేసీఆర్‌ను చీర కట్టుకుని బస్సు ఎక్కాలని సీఎం అన్నారు.. రేవంత్ మాట్లాడినందుకే మేం మాట్లాడుతున్నామని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గజగజ వణుకు.. BRS ఎమ్మెల్యేనా, కాదా అనేది గాంధీ స్పష్టత ఇవ్వాలన్నారు. కేసీఆర్‌తో గాంధీకి ఇబ్బంది లేకపోతే..తామంతా స్వాగతం పలుకుతామన్నారు. టీవీ9 వేదికగా ఇద్దరం చర్చించుకుందామని.. గాంధీ సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలనుకుంటున్నాం.అయితే.. అటు కౌశిక్‌రెడ్డి సవాల్‌తో.. ఇటు అరికెపూడి గాంధీ ప్రతి సవాల్‌తో ఇద్దరి నేతల ఇంటి దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. ఇప్పటికే పోలీసులు కౌశిక్‌రెడ్డి బయటకు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.