ముద్ర, తెలంగాణ బ్యూరో : మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బీఆర్ఎస్ అనుబంధ విద్యార్ధి విభాగం బీఆర్ఎస్వీ యత్నించింది. పోలీసులు వారిని మినిస్టర్స్ క్వార్టర్స్ వెళ్ళకుండా ముందే అడ్డుకోవడంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత ఏర్పాటు. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ వైద్య విద్యలో స్థానికంగా నిర్ణయించడానికి జీవో నెంబర్ 33ని ఉపసంహరించుకుని, కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్స్ క్యార్టర్స్ ముట్టడికి బయలుదేరారు.
వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం జరుగుతోన్న నేపథ్యంలో బీఆర్ఎస్ విద్యార్ధి నాయకులు ఆందోళన చేయడం పట్ల పోలీసులు అసహనం వ్యక్తం చేశారు.