- బీఆర్ఎస్ నేల బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :-హీరో నాగార్జునకు చెందిన ఎన్…కన్వెన్షన్ కూల్చివేతల వెనుక రూ. 400 కోట్ల రహస్యం దాగుందని బీఆర్ఎస్ నేతల బాల్క సుమన్ సంచలన ఆరోపణ చేశారు. ఇది కూల్చకుండా ఉండాలంటే నాలుగు కోట్లు అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి నాగార్జున ఒప్పుకోనందునే ఆ కన్వెన్షన్‌ను హైడ్రా చేత కూల్చి వేయించారని. బుధవారం తెలంగాణ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో పాటు ప్రజలంతా కోరుకుంటుంటే….. ఆయన మాత్రం డ్రామాలు ఆడ భవనాన్ని ఏర్పాటు చేశారు.
ఆరు గ్యాంటీల హామీలపై పచ్చి దగా చేస్తున్నారు.ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాది కావస్తున్నా ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చింది. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. అలా ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్దేమో కానీ.. కేసీఆర్ చేసిన అభివృద్ధిని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం వద్ద ఉన్న రాహుల్ గాంధీ విగ్రహాన్ని తాము కూల్చివేస్తామన్నారు.