26
ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఢిల్లీలోని నోయిడాలో అనేక పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఢిల్లీలోని దాదాపు యాభై పాఠశాలలకు ఈరోజు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు.
బాంబ్ స్కాడ్ తనిఖీలు…
దీంతో స్కూళ్లనుంచి విద్యార్థులను ఖాళీ చేయించి ఇళ్లకు పంపించి వేశారు. బాంబ్ స్కాడ్ రంగంలోకి దిగి పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. నోయిడాలోని పన్నెండు పాఠశాలలకు బెదిరింపుల మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో స్కూళ్లు తెరవకముందే మెయిల్స్ రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు