Home తెలంగాణ హైడ్రాకు విస్తృత అధికారాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

హైడ్రాకు విస్తృత అధికారాలు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
హైడ్రాకు విస్తృత అధికారాలు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • సన్న వడ్లకు రూ.500 బోనస్
  • ఆర్ఆర్ఆర్ ను ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీని ఏర్పాటు చేశారు
  • మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్
  • ఎస్ఎల్ బీసీ టన్నెల్ రివైజ్డ్ ఎస్టీమేట్ పనులకు ఆమోదం
  • ఈ పనులకు గానూ రూ. 4637 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
  • కోఠి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇని కొత్త పేర్ల మార్పుకు గ్రీన్ సిగ్నల్

ముద్ర, తెలంగాణ బ్యూరో :-హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి చట్టబద్దత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సుమారు మూడు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇందులో ప్రధానంగా హైడ్రాను మరింత బలోపేతం చేసేవిధంగా పలు అధికారాలను కట్టబెట్టింది. ఓఆర్ఆర్ కు లోపల చెరువులు, నాలాలు కబ్జాల కట్టడికి హైడ్రాకు పూర్తి అధికారాలను అప్పగించింది. అలాగే ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ నిర్మాణాలను తొలగించేందుకు అధికారాలు కల్పించామని రాష్ట్ర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేశారు.

మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన హైడ్రాకు మునుముందు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్న లక్ష్యంతో మంత్రివర్గం కూలంకషంగా చర్చించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో 150 మంది అధికారులు.. 946 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అలాట్ చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్‌కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్‌లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పారు. ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలు ఉన్నాయి. 51 గ్రామ పంచాయతీలను కోర్‌ అర్బన్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఉంటోంది. వీటన్నిటితో పాటూ పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తిస్తుందని పొంగులేటి చెప్పారు.

ఇక మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలోని 8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం. 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఏటూరునాగారం ఫైర్‌ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది అందించారు. కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల, హకీంపేటలో జూనియర్‌ కళాశాల నిర్వహిస్తున్న మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి వివరించారు.

అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లుకు రూ. 500 బోనస్ చెల్లించారు. అలాగే మూడు యూనివర్సిటీలకు పేర్లు మార్పుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వాటిల్లో కోఠి ఉమెన్స్ కాలేజీ పేరును చాకలీ ఐలమ్మగా మార్చుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా, హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు మార్చుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

అనంతరం ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఎల్ బిసి టన్నెల్ వర్క్స్ పనులకు రూ. 4,637 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇచ్చామన్నారు. రెండేళ్లలో ఈ టన్నెల్ పనులను పూర్తిచేస్తామన్నారు. ఈ టన్నెల్ చారిత్రాత్మకం కాను ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి డెడ్ స్టోరేజ్ నుండి కృష్ణ వాటర్ తీసుకుని అవకాశం ఉంటుందన్నారు. అలాగే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండింగ్ పనులను తొందరగా పూర్తిచేస్తామన్నారు.

ప్రతినెలా 400 మీటర్ల టన్నెల్ వర్క్స్ పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇక జనవరి నుండి రేషన్ కార్డ్ లకు సన్న బియ్యం ఇస్తామన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఎల్ బిసిపై గతంలో తాను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ వ్యంగంగా మాట్లాడారు. దీనిని ఆ ప్రభుత్వం పూర్తిగా. నిర్లక్ష్యం చేసింది. ఈ ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తుందన్నారు.ఏటా రెండు పంటలకు కాలువ ద్వారా బిసి నిల్లొస్తామన్నారు.ఇది పూర్తి అయితే తనకు, కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందో అన్న రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ దీనిని పూర్తిచేయలేదని తెలిపారు. ఈ ఎస్ఎల్ నల్గొండ జిల్లా పూర్తిగా ఫ్లోరైడ్ దూరం అవుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech