- కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలకు బాధ్యులు ఎవరు
- రుణాల ద్వారా ఎలా తీసుకున్నారు
- రుణాలు తీసుకున్న తర్వాత కార్పొరేషన్‌కు ఆస్తులు వచ్చాయా..?
- ఇంజినీర్లను ప్రశ్నించిన కాళేశ్వరం కమీషన్
- సమాధానాలు దాటిన చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి
- ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి పీసీ ఘో
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులపై కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫడవిట్లకు, చెప్పే సమాధానాలకు పొంతన లేదని, అధికారిక స్థాయిలోఉంది తెలియదు.. అని చెప్పడం కరెక్ట్ కాదంటూ హెచ్చరిక. కాళేశ్వరంపై కమీషన్ విచారణ కొనసాగుతోంది. బుధవారం నాటి నాటికు కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ. ఈ సందర్భంగా అధికారులపై కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వ అప్రూవల్‌తోనే కార్పొరేషన్ లోన్‌కు వెళ్తుందని, నాబార్డ్ నుంచి అప్పులు తీసుకున్నామని వెంకట అప్పారావు తెలిపారు. పెద్ద మొత్తంలో మీ వద్ద ఉన్న ఆస్తులు ఏంటని పిసి ఘోష్ తీసుకోవాలనుకుంటున్నారు. రామగుండం ఎన్టీపీసీకి నీళ్లను సరఫరా చేయడం ద్వారా…వచ్చే ఆదాయంతోనే మెయింటెనెన్స్ ఆఫీసర్ల వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు ప్లానింగ్ ముందే లోన్ తీసుకోవాలనుకుంటున్నారా పీసీ ఘోష్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు చేయలేదని పద్మావతి తెలిపారు. తీసుకున్న అప్పుల్ని బడ్జెట్లో చూపించారా అని ప్రశ్నించిన కమీషన్.. బడ్జెట్లో చూపించలేదని పద్మావతి చెప్పారు. కమీషన్ ప్రశ్నలకు తన పరిధిలో లేని అంశాలని భూషణ్ శర్మ దాట వేశారు. మూడు బ్యారేజీల ఎస్టిమేషన్స్ను ముందే ఆడిట్ చేశామని వివరణ ఇచ్చారు. కాగ్ రిపోర్టుతో తమకు సంబంధం లేదని కమిషన్‌కు అధికారులు వివరించారు.
బాధ్యత ఎవరిది..?
కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని కమిషన్ ఫైనాన్స్ అధికారులు ప్రశ్నించారు. ఈ కోరనే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, ఉద్యోగుల జీతాలు, చెల్లింపులపై ఆరా తీసింది. గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా వారిని కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, సంబంధిత వ్యవహారాల పీసీ ఘోష ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, సిబ్బంది, ఉద్యోగుల జీతాలు, చెల్లింపుల గురించి ఆరా తీశారు. బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు వెంకట అప్పారావు చెప్పగా.., వాటి ద్వారా వచ్చిన కార్పొరేషన్ నిర్వహణ కోసం వాడినట్లు తెలిపారు. కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం తనిఖీ చేస్తారా, రుణాలు ఎవరి ప్రకారం తీసుకున్నారని కమీషన్ ప్రశ్నించింది. అయితే, రుణాలు ఎవరి ప్రకారం తీసుకున్నారని కమీషన్ అడుగగా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాత రుణాలు తీసుకున్నట్లు ఫైనాన్స్ అధికారులు తెలిపారు.
ఆస్తులేమైనా వచ్చాయా..?
కాళేశ్వరం కార్పొరేషన్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు ఆమోదం తర్వాత రుణాలు తీసుకున్నట్లు అధికారులు చెప్పగా.. కాళేశ్వరం కార్పొరేషన్ కు రుణాలు తీసుకున్న తర్వాత ఏమైనా ఆస్తులు వచ్చాయా అని న్యాయశాఖ పీసీ ఘోష ప్రశ్నించారు. ప్రస్తుత కార్పొరేషన్‌కు ఎలాంటి ఆదాయం లేదని, ఆస్తులు రాలేదన్న అధికారులు, బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. కాగ్ నివేదిక గురించి అకౌంట్స్ అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ అడిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపు విషయంలో కాగ్ నివేదికతో అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందన్న అధికారులు, ఆర్థిక స్థోమత, క్రమశిక్షణ వైఫల్యం విషయంలో తాము స్పందించలేమని చెప్పారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పద్మావతి కమీషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. పలు ప్రశ్నలకు తనకు సంబంధం లేదు, తెలియదని, చెప్పలేనని పద్మావతి సమాధానం ఇచ్చారు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా ఉండి తెలియదంటే ఎలా అంటూ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖజానాపై అంత భారం పడుతుంటే పట్టింపు లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.