తన స్టార్ పవర్ తో భారీ కలెక్షన్లు రాబట్టగల అతి కొద్దిమంది హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. తన తాజా చిత్రం 'దేవర' (దేవర)తో మరోసారి రుజువు చేశారు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన సినిమా 'దేవర'. సెప్టెంబర్ 27న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ పాన్ ఇండియా మూవీ మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. (దేవర కలెక్షన్స్)
రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన దేవర.. కేవలం ఆరు రోజుల్లోనే రూ.190 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్రేక్ ఈవెన్ కోసం. నేటి నుంచి దసరా సెలవులు కావడంతో మరో పది రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర దేవర దూకుడు కొనసాగే అవకాశం ఉంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం రూ.250 కోట్ల షేర్ వరకు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడినట్టే.