ముద్ర,సెంట్రల్ డెస్క్:-నగరంలో మరోసారి ఎన్డీయే సర్కార్ కొలువుదీరింది. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రోజున 70 మంది మంత్రులతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుసటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ కొత్త మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి తొలి నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. పట్టణ, ప్రాంత పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి 3 కోట్ల గృహ నిర్మాణానికి ఆర్థిక సాయంగా మరో కేబినెట్ ఆమోదం.
సోమవారం సమావేశమైన యూనియన్ కేబినెట్ పీఎం ఆవాస్ యోజన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పీఎం ఆవాస్ యోజనకు అర్హులైన కుటుంబాల సంఖ్యను పెంచేందుకు ఈ మేరకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే కేబినెట్. గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని పేద ప్రజలకు ఇప్పటికే ఆమోదం తెలిపిన ఇళ్లతో పాటు మరో 3 కోట్ల ఇళ్లకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.