Home తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే పాత్ర – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే పాత్ర – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
రాష్ట్ర పునర్నిర్మాణంలో ఇంజనీర్లదే పాత్ర - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ఇంజనీర్లు మోక్ష గుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి
  • రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :- కొత్తగా నియామకమైన ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకొని తమ కెరీర్లను నిర్మించుకోవాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం హైటెక్స్ ప్రాంగన్‌లోని న్యాక్ (నేషనల్ అకాడెమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్) లో టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 156 మంది ఆర్ బీ శాఖ ఇంజనీర్లకు శాఖపరమైన అవగాహన కల్పించేందుకు 5 రోజుల ఒరియెంటేషన్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా నూతన ఇంజనీర్లకు మార్గనిర్దేశనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత పదేండ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డట్టే.. ఆర్ అండ్ బీ శాఖ సైతం నియామకాలు జరగక, ఇంజనీర్లు లేక పనులను పర్యవేక్షించే పరిస్థితి లేక ధైర్యవంతంగా కాలం వెల్లదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పది మండలాలకు ఒక్క ఇంజనీర్ అందుబాటులో లేని దుర్భర పరిస్థితులను ఆర్ అండ్ బీ శాఖ చూసింది.అందుకే టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌లలో ఆర్ అండ్ బీ శాఖకు కేటాయించబడిన 156 మంది ఇఇలను ఫీల్డ్‌లోకి పంపించేందుకే ఒరియెంటేషన్ తరగతులను పొందుతున్నట్లు తెలిపారు.

పదేండ్లు విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణంలో..ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. కొందరు పాలకులు, అతికొద్దిమంది ఇంజనీర్ల స్వార్ధం యావత్ ఇంజనీర్లందరికి మాయని మచ్చగా మారింది. మీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యనో, నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ బహదూర్‌ వంటి ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవాలి కానీ కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదని మీ అందరిని కోరుతున్నానని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ పై పంచులు వేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు కట్టిన వెంటనే కూలిపోయి ఇంజనీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన సంఘటనలను మనం చూశామన్నారు. దయచేసి అలాంటి ఇంజనీర్లను కనీసం కలలోకి కూడా రానివ్వకండని మంత్రిగా సలహా ఇస్తున్నానని అన్నారు. విశ్వేశ్వరయ్య వంటి ఇంజనీర్లు రూపొందించిన ప్రణాళికలు ఇవ్వాల్టీకి కూడా మనల్ని రక్షిస్తున్నాయి.

ఒకరోజు విశ్వేశ్వరయ్య పని కోసం ఒక ప్రాంతం నుంచి మరో సమయంలో ట్రైయిన్ లో వెలుతున్న.. ట్రైయిన్ కొద్దిదూరం నడిచిన ఆయన చైన్ లాగి ట్రైయిన్ ను ఆపేస్తున్నారు. ట్రైయిన్ లో ఉన్న బ్రిటీషర్లంతా విశ్వేశ్వరయ్య ఎందుకు ట్రైయిన్ ఆపారో అర్ధంకాక చూశారు. ఇంతలో ట్రైయిన్ సిబ్బంది వచ్చి.. విశ్వేశ్వరయ్యను పట్టుకొని చైన్ ఎందుకు లాగారని ప్రశ్నిస్తున్నారు. అందుకు విశ్వేశ్వరయ్య కొద్ది దూరంలో నాకు రైలు పట్టాలు విరిగినట్లు అనుమానంగా ఉన్నాయని… ట్రైయిన్ నడుస్తున్నప్పుడు శబ్ధం మారిందని వివరించారు. ట్రైయిన్ సిబ్బంది కొంత దూరం పట్టాలను పరిశీలించి నిజంగానే పట్టాలు విరివిగా గుర్తించి.. విశ్వేశ్వరయ్యను అభినందిస్తారు. అలా మీరంతా విశ్వేశ్వరయ్యల అత్యంత శ్రద్ధతో భక్తితో విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీ కొత్త ఇంజనీర్ల పట్ల అత్యంత ఆశాభావంతో. మీకు అప్పగించిన పనిని నిబద్ధతతో చేస్తే మన రాష్ట్రం ప్రగతిబాటన సాగుతుంది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రాష్ట్ర ప్రగతిలో కీలకమైన సూపర్ గేమ్ ఛేంజర్ లాంటి ఆర్ఆర్ఆర్ తో పాటు, టిమ్స్ హాస్పిటల్ భవనాలు, జిల్లాల్లో పరిపాలన సంబంధిత భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్తగా ఎంపికై ఉద్యోగాల్లోకి చేరుకుంటున్న ఈ సమయంలో ఒక ఇంజనీర్ గా తన సలహా ఏంటంటే… మీరు నిర్మించేది కేవలం రోడ్డో, బ్రిడ్జినో, భవనమో కాదన్నారు. అది లక్షల మంది అవసరాలు తీర్చే ఒక కట్టడం అన్న సంగతిని గుర్తెరగాలని కోరుకుంటున్నాను అన్నారు. అప్పుడు మాత్రమే మీరు నాణ్యమైన నిర్మాణాలను చేపడతారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది. గత ప్రభుత్వం 10 మండలానికో ఇంజనీర్ కూడా లేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొస్తే… మేం రిక్రూట్ మెంట్లు

పూర్తి చేసి ఆర్ అండ్ బీ ని పటిష్టం చేస్తున్నామన్నారు. తాను 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉంటానని… మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకరావాలన్నారు.వెంటనేసమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. మనందరం కలిసి ఒక కుటుంబంలో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించామన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech