ముద్ర,సెంట్రల్ డెస్క్:- పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాల్లో కంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో మృతులకు ఎక్స్‌గ్రేషియాను పెంచారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయపడ్డారు. దీనితో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హుటాహుటిన డార్జిలింగ్ బయలుదేరి వెళ్లారు. ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రకటించారు. ఆ తర్వాత ఎక్స్‌గ్రేషియా పెంపును అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వినిపించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2.5 లక్షలు, స్వలంగా గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
ఎన్‌ఎఫ్ఆర్ జోన్‌లో ప్రమాదం జరగడం దురదృష్టకమని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు జరుగుతున్నాయని అశ్వని వైష్ణవ్ తెలిపారు. రైల్వే, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ పూర్తి సమన్యాయంతో చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారని, ఘటన స్థలికి చేరుకున్నారని సీనియర్ అధికారులు వివరించారు.
బాధితులకు మెరుగైన ఎక్స్ గ్రేషియా పరిహారం అందించబడుతుంది;
మరణిస్తే ₹10 లక్షలు,
తీవ్ర గాయాలకు ₹2.5 లక్షలు మరియు చిన్న గాయాలకు ₹50,000.— అశ్విని వైష్ణవ్ (@AshwiniVaishnaw) జూన్ 17, 2024