24
మెక్సికో: మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు. ఆ దేశంలో తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలుగా ఎన్నికవనున్నారు. అధికార పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60 శాతం ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మరో మహిళ బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30 శాతం ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.