ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రుణ మాఫీ కోసం రోడ్డెక్కారు. శరతులు లేకుండా రైతులకు రూ.2లక్షల రుణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు సోమవారం గాంధారి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీలకు అతీతంగా జిల్లాల్లోని ఆయా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రధాన రహదారిపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పుస్తకాల్లో ప్రామాణికంగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ పాస్లు, రైతు భరోసా కింద రూ.15వేలు విడుదల చేయాలి, పాడి రైతులకు పెండింగ్లో ఉన్న పాల బిల్లు విడుదల చేయాలి, అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం పక్రటించారు. రైతులు టాక్టర్ను ప్రైవేట్ వాహనాల్లో భారీ సంఖ్యలో తరలిరావడోం ప్రధాన రహదారిని స్తంభింపజేసింది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిమాండ్లతో నేరవేర్చే వరకు తమ ఉద్యమం ఆగదంటూ రైతు ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. దీనితో ట్రాఫిక్ జామ్ అయింది.