అరెస్ట్ అయిన అర్జున్ హవారే, రోణిత్ చింతన్వర్ ఇద్దరూ ప్రమాద సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆడికారు ఫిర్యాదుదారు జితేంద్ర సొంకాంబలే కారును తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఢీకొట్టింది. ఆ తర్వాత ఓ మోపెడ్‌పై వెళ్తున్న మరో ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వారు గాయపడ్డారు.
ప్రమాద సమయంలో కారులో సంకేత్ సహా మొత్తం ఐదుగురు ఉన్నారు. ఆ సమయంలో వారు ధరంపేటలోని ఓ బారు నుంచి తిరిగి వస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. సొంకాంబలే ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బెయిలుపై వారిని విడిచిపెట్టారు. ఆ కారు తన కుమారుడి పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు బీజేపీ మహారాష్ట్ర చీప్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాత విచారణ చేపట్టి, నిందితులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చట్టం అందరికీ సమానమేనని, తాను ఏ పోలీసు అధికారితోనూ మాట్లాడలేదని చెప్పారు.