Home సినిమా RTI మూవీ రివ్యూ: ఆర్టీఐ మూవీ రివ్యూ – Prajapalana News

RTI మూవీ రివ్యూ: ఆర్టీఐ మూవీ రివ్యూ – Prajapalana News

by Prajapalana
0 comments
RTI మూవీ రివ్యూ: ఆర్టీఐ మూవీ రివ్యూ


మూవీ : ఆర్.టి.ఐ
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, వరలక్ష్మి శరత్ కుమార్, రవి కుమార్, మీనా వాసు, రవి, శంశాంక్ ఆదిత్య మీనన్, శంశాంక్ శంకర్
రచన: బాలాజీ జయరామన్
ఎడిటింగ్: ఎస్. రిచర్డ్
సంగీతం: శశాంక్ భాస్కరుని
సినిమాటోగ్రఫీ: సంజయ్ లోగనాథ్
నిర్మాత, దర్శకత్వం: సురేశ్ కృష్ణ
ఓటీటీ: ఈటీవీ విన్

కథ:
మాయ అనే అమ్మాయి రాత్రివేళ ల్యాప్ టాప్ లో ఏడుస్తూ ఏదో టైప్ చేస్తుంది. ఆ తర్వాత తను వాళ్ళ అమ్మ, నాన్నలకి కాల్ చేస్తుంది కానీ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మాయ వాళ్ళ అమ్మనాన్నలు ఇంటికొచ్చి చూస్తే తను చనిపోయి ఉంటుంది. అయితే మాయ మారణం ఆమె పేరెంట్స్ కి ఎన్నో అనుమానాలు కలుగజేస్తుంది.. ఎందుకంటే వారిద్దరు డాక్టర్స్. మాయ చనిపోయాక తన చేతి గోర్లు ఢిఫరెంట్ కలర్ లోకి మారుతాయి. దాంతో వాళ్ళు’ మాయకి అటాప్సీ చేపిస్తారు’ కానీ ఆ రిజల్ట్ నార్మల్ వస్తుంది.’ ఇక ఇదే విషయమై మాయ పేరెంట్స్ కోర్ట్ ని ఆశ్రయిస్తారు. అసలు మాయ ఎలా చనిపోయింది? మాయ చావుకి విక్టర్ స్కూల్ కి మధ్యగల సంబంధమేంటి? మాయ చావుని ఆర్ టీ ఐ(RTI) పరిష్కరించగలిగిందా లేదా అనేది మిగిలిన కథ. (ఆర్టీఐ మూవీ రివ్యూ)

విశ్లేషణ:
కోర్ట్ రూమ్ డ్రామా, సీరియస్ ప్రాబ్లమ్, పేరెంట్స్, స్టూడెంట్స్, స్కూల్ యాజమాన్యం.. ఇదంతా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ ఎలిమెంట్స్ తో మంచి కథని ప్రెజెంట్ చేయొచ్చు.. కానీ ఇదేదీ వర్కవుట్ అవ్వలేదు. సినిమా నిడివి గంటా ఇరవై మూడు నిమిషాల్లో అయినా మొదటి పదిహేను నిమిషాలకే అర్థం అవుతుంది.

ఇదే స్టోరీ లైన్ తో ఎన్నో సినిమాలు చూశాం.. ఇప్పటికే కోర్ట్ రూమ్ డ్రామాగా చాలా సినిమాలు అటు థియేటర్లలో, ఇటు ఓటీటోలో ఫుల్ గా వచ్చేశాయి. కానీ ఈ ఆర్ టీ ఐ(RTI).. వాటికి భిన్నంగా పూర్ స్టోరీ, నెమ్మదిగా సాగే కథనం, యాక్టర్స్ పర్ఫామెన్స్ కూడా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఆర్ టీ ఐ గురించి చెప్పే మొదటి పది నిమిషాలు బాగున్నప్పటికి చివరి వరకు ఆ టెంపోని కొనసాగించలేకపోయారు మేకర్స్.

ప్రైవేట్ స్కూల్స్ పిల్లలపై ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయో చూపించడానికి ఎంత అవుట్ డేటెడ్ గా చూపించాలో అంతా చూపించారు. స్కూల్ ర్యాంకుల కోసం ఏదైనా చేస్తుంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలు ఫస్ట్ వస్తే చాలనుకుంటారు. ఈ పాయింట్ ని చూపించడానికి చాలా సమయం తీసుకున్నారనిపించింది. ఏది అవసరమో అది వదిలేసి, ఏది అవసరం లేదో దానిని హైలైట్ చేశారు. రైట్ టూ ఇన్ఫర్మేషన్ (RTI) ని ప్రాపర్ జస్టిఫికేషన్ లేదనిపిస్తుంది. ఇక ఎంత ల్యాగ్ చేయాలో అంతా చేశారు. ఎడిటింగ్ ఒకే. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మ్యూజిక్ నాట్ ఒకే. నిర్మాణ విలువలు పూర్తిగా ఉన్నాయి.

నటీనటుల పనితీరు:
రాజేంద్ర ప్రసాద్, వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మీనా వాసు, రవిశంకర్, రవి కుమార్, శశాంక్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.

ఫైనల్ గా..
నెమ్మదిగా సాగే ఆర్ టి ఐ.. పేరెంట్స్ కోసమే. జస్ట్ ఓకే.

రేటింగ్: 2/5

✍️. దాసరి మల్లేశ్

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech