ముద్ర, తెలంగాణ బ్యూరో : 30న ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల రైతు రుణమాఫీ అమలు సాధన దీక్ష చేపట్టనుంది. ఈ మేరకు శుక్రవారం దీక్షాస్థలిని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎన్వీ సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వరంగల్ నగరంలో రైతు డిక్లరేషన్ ను తుంగలో తొక్కిందని తెలిపారు. రైతు రుణమాఫీపై సీఎం, మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు కోసం దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందంటే, మంత్రులు మరికొంతమందికి చెబుతున్నారు. రైతు భరోసా ఊసే అందించింది. వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని. కౌలు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసింది. రైతుల పక్షాన బీజేపీ చేసే పోరాటానికి పెద్ద ఎత్తున రైతుల మద్దతు కూడగట్టామని ఆయన చెప్పారు..