- యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష..
ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇక నుంచి యాదాద్రికి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను నియమించారు.శుక్రవారం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు.టీటీడీలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తిస్థాయి అధ్యయనాలతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు సూచించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు.బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. రిపోర్ట్ అందించారు.