Home తాజా వార్తలు మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది.. – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
మూసీ పునరుజ్జీవం జరిగి తీరుతుంది.. - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • సంగెం శివయ్య దగ్గర సంకల్పం తీసుకున్నా.. మూసీని ప్రక్షాళన చేసి తీరుతా…
  • బుల్డోజర్లకు అడ్డుపడతామన్న వాళ్లెవరో పేర్లు ఇవ్వండి..
  • నల్లగొండ ప్రజలతో కలిసి వచ్చి అడ్డుకునే వాళ్లపై బుల్డోజర్లు తీసుకుపోతా… లేకుంటే నా పేరు మార్చుకుంటా…
  • అడ్డుపడుతామని బిల్లా, రంగాలు ధైర్యంగా చెప్పండి వెంకన్నను బుల్డోజర్‌పై ఎక్కిస్తా.. సామెల్‌తో జెండా ఊపిస్తా…
  • మూసీ పాదయాత్రలో కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శివయ్య దగ్గర సంకల్పం తీసుకున్నా.. మూసీని ప్రక్షాళన చేసి తీరుతానని..బుల్డోజర్లకు అడ్డుపడతామన్న వాళ్లెవరో పేర్లు ఇవ్వండి నల్లగొండ ప్రజలతో కలిసి వచ్చి అడ్డుకునే వాళ్లపై బుల్డోజర్లు తీసుకువస్తానని… లేకుంటే నా పేరు మార్చుకుంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మూసీ పాదయాత్రలో కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకనాడు మంచి నీటిని అందించిన మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి విషాన్ని చిమ్ముతో అందించింది.

పాలకులు పగ పట్టారా.. దేవుడు శాపం పెట్టిండా అని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు బాధపడుతున్నారని మూసీ పునరుజ్జీవింప చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదు.. ఇక్కడి చెరువుల్లో చేపలు బ్రతికే పరిస్థితి లేదు..ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

బీఆరెస్ నేతలకు దోచుకోవడమే తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదని అందుకే మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అండగా ఉంటామని చెప్పిన కమ్యూనిస్టు సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.మూసీ కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అణుబాంబు కంటే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. వరంగా ఉండాల్సిన మూసీ శాపంగా మారుతోందని అందుకే మూసీ ప్రక్షాళన చేస్తారో లేదో ఒక్కసారి ఆలోచించాలని ప్రజలు భావిస్తున్నారు.

మోదీ గుజరాత్ ను బాగు చేసుకోవచ్చు కానీ మేం మూసీని బాగుచేసుకోవద్దా అని బిజెపి నాయకులు ప్రశ్నించారు. ఇది నా జన్మదినం కాదు… ఇక్కడికి రావడంతో నా జన్మ ధన్యమై ఉంది. కెసిఆర్ ని బిడ్డ మూడు నెలలు జైలుకు పోతేనే నీకు దుఃఖం వస్తే… మూసీ పరివాహక బిడ్డల జీవితాలు పోతుంటే నీకు పట్టదా? అని ప్రశ్నించారు.నల్లగొండ ప్రజలు నీకు ఓట్లు వేయలేదనా కేసీఆర్ ?మూసీ ప్రక్షాళన అడ్డుకోవాలని చూస్తున్నావన్నారు.నల్లగొండ జిల్లా పౌరుషాల గడ్డ… మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని చెప్పారు.వాళ్ల అవినీతి కోసం, వాళ్ల దోపిడీ కోసం మూసీని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఇవాళ్టి పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది
  • బిల్లా రంగాలకు సవాల్ విసురుతున్న
  • 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతా

బిల్లా రంగాలు రావాలి.. మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech