- ఉదయం నుంచే సర్వే షురూ
- హైదరాబాద్ లో పొన్నం…ఇతర జిల్లాలో మంత్రి మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం
- హైకోర్టు ప్రకారం కులం, మతం చెప్పని వారికి ప్రత్యేక కాలం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే బుధవారం అట్టహాసంగా మొదలైంది. ఉదయం 10 గంటల నుంచే రాష్ట్రంలో సర్వే సందడి కనిపించింది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వేలు. అయితే కులగణనకు సంబంధించి హైకోర్టుకు కీలక సూచన చేసింది. కులగణన పేరుతో సర్వేలో కులం, మతం వారి కోసం ప్రత్యేక కాలమ్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తదనుగుణంగా మతం చెప్పని వారికి ప్రత్యేకంగా ఒక కాల ఏర్పాటు చేసింది.
కాగా సర్వేలో ఉద్యోగుల ఇంటింటికి వెళ్లి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై వివరాలు సేకరించారు. ప్రజల, అప్పులు, ఆదాయాలు, కుటుంబ సభ్యులు, విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వివరాలు, ఉద్యోగం, వృత్తి వంటి 75 రకాల ప్రశ్నలకు సంబంధించిన ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నారు. కుటుంబ యజమాని, వారి సభ్యుల వివరాలతో పాటు, ప్రతి ఒక్కరి ఫోన్ నంబర్, వృత్తి, ఉద్యోగ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంట్లో ఎవరు విదేశాలకు వెళ్లారు, ఏ కారణం వల్ల వెళ్లారు అన్న సమాచారం కూడా అడుగుతోంది. యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా దేశాలకు వెళ్లినప్పుడు, ప్రతి దేశానికి ప్రత్యేక కోడ్‌ను నమోదు చేస్తున్నారు.
ఉదయం నుంచి మొదలు…
కులగణన ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వేను ప్రభుత్వం చేపట్టింది. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కులగణన పూర్తి చేయడానికి 30 రోజుల గడువు పెట్టింది. 80 వేల మంది ఎన్యూమరేటర్ల నియమించింది. మండలాలవారిగా కంప్యూటరీకరణ చేయనున్నారు అధికారులు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు… ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, విద్యార్హత, పలు వ్యక్తిగత వివరాలను నమోదు చేస్తారు. అలాగే పార్ట్ -2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరిచారు. ముందుగానే ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కాగా ఈ సర్వేలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించారు.