- ప్రయాణీకుల కోసం టూర్ ప్యాకేజీలు
- కృష్ణానదిలో జలవిహారానికి సర్కార్ మరో ముందడుగు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు కృష్ణా నదిలో జలవిహారానికి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. శనివారం నుంచి నల్గొండ జిల్లా నార్జునసాగర్ నుంచి శ్రీశైలం జిల్లా నల్లగొండ నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచ్ ప్రయాణం.ఈ మేరకు పర్యాటక శాఖ ప్రయాణికుల కోసం టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకొని అధికారులు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజానికి గడిచిన కొన్నేళ్ల నుంచి ఈ బోటును నడిపేందుకు ప్రణాళికలు వేశారు. అయితే, ఆ తర్వాత సరైన వర్షాలు లేని కారణంగా బోటు ప్రయాణం వీలుపడలేదు.
అయితే తాజాగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీరు ఉండడంతో బోటు ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్యాకేజీ ధర విషయానికొస్తే.. బోటు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు తెలిపారు. అయితే.. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపబడ్డాయి. నేరుగా హైదరాబాద్ నుంచి కూడా టూర్ ఆపరేట్ చేస్తున్నారు.