- దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించాలి
- విద్యా మండలి, వీసీలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- మండలి చైర్మన్, కొత్త వీసీలతో భేటీ
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి ఉన్నత విద్యామండలి, వైస్ ఛాన్సలర్లకు సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు సీఎంను జూబ్లీహిల్స్‌లోని శనివారం నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎవరి ప్రభావితంతోనో వైఎస్ ఛాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదన్న సీఎం మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగింది.
బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. ప్రపంచ విశ్వవిద్యాలయాల పట్ల విశ్వాసం సన్నగిల్లిందనీ తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాల్సిన బాధ్యత ప్రతి వీసీపై ఉంది. అందుకోసం విశ్వవిద్యాలయాలకు నూటికి నూరుశాతం ప్రక్షాళనకు తగిన విధంగా ఉంది. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లన్న సీఎం ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలన్నారు. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలని అలాగే వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలన్నారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుందని అలాంటి వారికి ప్రభుత్వ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.
ఎవరైనా వీసీలు, సిబ్బంది తప్పు చేస్తే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందనే గుర్తు పెట్టుకుని పని చేయాలన్నారు. యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి సారించడంతో పాటు వాటికి బానిసగా మారిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఉన్నత మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా), ప్రతాప రెడ్డి (కాకతీయ), జీఎన్ శ్రీనివాస్ (పాలమూరు), నిత్యానంద రావు (తెలుగు), అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), యాదగిరి రావు (తెలంగాణ), అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), రాజిరెడ్డి (కొండలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ), ఉమేష్ కుమార్ (శాతవాహన),సూర్య ధనుంజయ (మహిళా వర్సిటీ),గోవర్దన్ (బాసర ఐఐఐటీ) ఉన్నారు.