వరుణ్‌తేజ్ హీరోగా కె.కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మట్కా' వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజేందర్‌రెడ్డి తీగల, రజని తాళ్ళూరి చిత్రం ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్‌వైడ్గా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ శనివారం విడుదలైంది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనర్‌లో రూపొందించబడింది. మట్కా జూదం ప్రధానాంశంగా నిర్మించిన ఈ సినిమా వరుణ్‌తేజ్‌కి ఒక డిఫరెంట్ మూవీగా చెప్పొచ్చు.
ఒక సాధారణమైన కుర్రాడు మట్కా జూదంలో నిష్ణాతుడై ఎలా ఎదిగాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందించిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కుర్రాడిగా ప్రారంభమై మధ్య వయస్కుడిగా మారే సమయానికి అతని జీవితంలో ఎన్ని మార్పులు జరిగాయి అనేది సినిమాలో చూపించడం జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే ట్రైలర్‌లోనే మొత్తం కథ చెప్పేశారా అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాల్లో వివిధ దశల్లో కనిపించే ఎమోషన్స్, హీరో తన జీవితంలో ఎదిగిన విధానం అన్నీ ఈ ట్రైలర్‌లో కనిపించాయి. అయితే ఈ ట్రైలర్‌లో సినిమాపై క్యూరియాసిటీ పెంచే అంశాలు ఏమీ లేవని అర్థమవుతోంది. అయితే మట్కా అనేది ఒక వ్యసనమని, దానివల్ల జీవితాలు నాశనమవుతాయని చెప్పే ప్రయత్నం చేశారు. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న హీరో కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగే విధంగా అతను జీవితంలో ఏం కోల్పోయాడు, వ్యక్తిగతంగా ఏం కోల్పోయాడు అనే విషయాన్ని ప్రస్తావించారు. డిఫరెంట్ ఏజ్‌లో వరుణ్‌తేజ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. జి.వి.ప్రకాష్‌కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మరి ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఇంకా సినిమాలో ఏం ఉన్నాయనేది నవంబర్ 14న విడుదలయ్యే 'మట్కా' చూస్తే అర్థమవుతుంది.