- రేవంత్ , ఆయన క్యాబినెట్ ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు
- పెద్ద బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసి వసూళ్ళు చేస్తున్నారు
- బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
- కుటుంబానికి అండగా ఉంటామని భరోసా
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైడ్రా ఒక బ్లాక్ మెయిల్ సంస్థ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హైడ్రాను పేదల మీదకు ఉసిగొల్పి, నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇళ్ళను కూలగొడుతూ భయానక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద బిల్లర్లను బ్లాక్ మెయిల్ చేసి వసూళ్ళు తెలుసు. ఈ మేరకు సోమవారం హైడ్రా కూల్చివేతల కోసం కూకట్ పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్ పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారు.
హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందిందని ఆయన ఏదన్నారు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని అన్నారు. రేవంత్ సర్కార్ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బుచ్చమ కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడి , ఆర్థిక సాయం చేసింది. హైడ్రా బాధితులందరికీ న్యాయసాయం బీఆర్ఎస్ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు ఓటు వేసినందుకే రేవంత్ ప్రభుత్వం పగ, కసి పెంచిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఏం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పెద్ద పెద్ద బిల్డర్లను రేవంత్ రెడ్డి సర్కార్ బెదిరించి వసూళ్ళకు ఉంటుందని ఆయన తెలియజేసారు. హైడ్రాతో ఆర్ధిక మంత్రికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆర్థికమంత్రి ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారని ఆయన నిలదీశారు.
పేదల ఇళ్ళకు నోటీసులు ఇస్తున్న హైడ్రా సంస్థ , ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్ళు నిర్మించిన రేవంత్ రెడ్డి సోదరుడి కి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నో హామీలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కడతామని, ఇంటి నిర్మాణం రూ. 5 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అయితే ఒక్క ఇళ్లు కట్టలేదన్నారు. కానీ ఎన్ని ఇళ్లు కూలగొట్టారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో కాదు ఊళ్లలో కూడా రేవంత్ రెడ్డి అరాచకం గురించి మాట్లాడాలని అన్నారు.