- రాజ్ పాకాల నివాసంలోకి వెళ్లేందుకు పోలీసుల యత్నం
- అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ నేతలు…పలువురు అరెస్టు
ముద్ర, తెలంగాణ బ్యూరో :- ఆదివారం ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్త వాతావరణం. రాజ్ పాకాల విల్లాలో విదేశీ మద్యం ఉందనే అనుమానంతో పోలీసులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ రాజ్ పాకాల విల్లాకు తాళం వేసి ఉండటంతో.. అతడి సోదరుడు శైలేంద్ర పాకాల నివాసంలో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే పోలీసులను లోనికి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేయడంతో విల్లా దగ్గర కొద్దిసేపు హైడ్రామా.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో కుత్బుల్లాపూర్ బీఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా పలువురిని స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ ఎక్సైజ్ అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రశ్నించగా.. న్యాయవాది సమక్షంలోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక విధులకు ఆటంకం కలిగించడాన్ని పోలీసులు నచ్చజెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గుదల ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.