- వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పేదల అభివృద్ధి కోరేది కాంగ్రెస్ ప్రభుత్వమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆలివ్ తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 39 బ్యాటరీ ట్రై సైకిల్స్ ను వికలాంగులకు ఏర్పాటు చేసింది. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను నిరుద్యోగ యువతీ యువకులు వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన 6 గ్యారంటీల పథకాలు తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి చేరువయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మండలంలో ఏర్పాటు చేసే ప్రతి పరిశ్రమను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కరివిరాల కొత్తగూడెంలోని సర్వేనెంబర్ 10లో ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే రానున్న రోజుల్లో 17 వేల మెట్రిక్ టన్నుల గోదావరి నిర్మించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గ డిగ్రీ కాలేజ్ తో పాటు ఐటిఐ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.
గత ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు 25 వేల కోట్ల నిధులను ఇస్తున్నట్లు చెబుతున్నా బీఆర్ఎస్ నాయకులు అట్టి నిధులను ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. మూసి ప్రక్షాళన చేసే ఏ పేద కుటుంబాన్ని రోడ్డున పడేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదన్నారు. మన నియోజకవర్గానికి 3500 మంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని, అసలు గూడులేని నిరుపేదలను గుర్తించి వారికి వర్తింపచేసేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషు కుమార్, తహశీల్దార్ కి దయానందం, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సిడిపిఓ శ్రీజ, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి, డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు, అంగన్‌వాడి సూపర్‌వైజర్ అనురాధ, పోషణ అభయన్ కోఆర్డినేటర్ శివ శంకర్, ఎఫ్ ఆర్ ఓ వినోద్, ఐసిపిఎస్ మండల అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఉపాధ్యక్షులు చింతకుంట్ల బివెంకన్న,పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, దాసరి శీను, ఎస్సీ సెల్ అధ్యక్షులు తప్పట్ల శంకర్, మిట్ట గడుపుల అనూక్, కలకోట్ల మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.