- ఆర్థిక నిర్వహణ, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్ మెంట్ లో తెలంగాణ టాప్
- దీనికి ఏకనమీ అండ్ పొలిటికల్ వీక్లిలో ప్రచురితమైన డేటానే నిదర్శనం
- కేసీఆర్ సమర్థ పాలనకు ఈ గణంకాలే సజీవ సాక్ష్యం
- వాళ్లు చేసినవన్నీ తప్పుడు, బూటకపు ప్రచారాలే తేలిపోయాయి.
- 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేతకాకే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేలా విష ప్రచారం
- ఎన్ని అబద్దాలు వ్యాప్తి చేసిన చివరికి సత్యమే గెలుస్తుందంటూ వ్యాఖ్య
- తప్పు చేశామంటూ ఇకనైనా కాంగ్రెస్ నేతలు ప్రజలను క్షమాపణ కోరాలి
- కేటీఆర్ డిమాండ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేయడంతో పాటు…ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నవన్నీ దివాళాకోరు తప్పుడు ఆరోపణలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ కారణంగా ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లిలో ప్రచురితమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్ మెంట్ ఇండెక్స్ సూచీలే నిదర్శనమని. ఈ సూచీలను గమనించే ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సహా కాంగ్రెస్ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థమవడానికి. ఆర్థిక నిర్వహణలో2014-15 నుంచి 2022-23 వరకు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న ఇండెక్స్ ను మంగళవారం కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. అప్పుల నిర్వహణ ఇండెక్స్, రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌లో నూ తెలంగాణ దేశంలోనే రెండో ప్రదర్శన. ఎకానమీ అండ్ పొలిటికల్ వీక్లిలో ప్రచురితమైన ఈ ఇండెక్స్ లను కేటీఆర్ ప్రజల ముందుంచారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఆర్థిక నిర్వహణతో పాటు అప్పుల విషయంలో ఎంత క్రమశిక్షణగా వ్యవహరించిందో ఈ ఇండెక్స్‌లోని గణాంకమే సాక్ష్యమన్నారు. సత్యాలు, వాస్తవాలు ఇట్లా వుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం పొద్దున లేస్తే దివాలా తీసిన రాష్ట్రం అని దిక్కుమాలిన ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆరు గ్యారెంటీలను..420 హామీలను అమలు చేయడం చేతగాక అప్పులపై తప్పుడు ప్రచారం చేసి తప్పించుకోవాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ దివాళకోరు, దిక్కుమాలిన ప్రచారం
పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో టాప్ గా నిలిపిన కేసీఆర్ పై కావాలనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అడ్డగోలుగా ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు తీర్చటం చేతకాక కేసీఆర్ పై బురద చల్లే కుట్ర చేస్తున్నారు. రాష్ట్రం దివాళా తీసింది…బీఆర్ఎస్ భారీగా అప్పులు చేసిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారమంతా డొల్ల అన్నది ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టంగా ఉందని…దివాళ తీసిందల్లా కాంగ్రెస్ నాయకత్వం…వారి బుర్రలేనని. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై పిచ్చి వాగుడు వాగుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందున్న వాస్తవాలను మసి పూసి మారేడు కాయ చేస్తామంటే జనం నమ్మరని చెప్పారు.
తప్పుడు ప్రచారాలను ఎన్నోసార్లు ఎండగట్టాం
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక స్థితిపై కాంగ్రెస్..బీజేపీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా అనేక సార్లు పక్కా లెక్కలతో సభ బయట..వెలుపలా వాస్తవాలను వెల్లడిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆర్బీఐ నివేదికలు, కాగ్, ప్రధాన మంత్రి ఆర్థిక మండలి రిపోర్టులు, ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ ఆర్థిక సౌష్టవాన్ని పటిష్ఠతను పదే పదే నిరూపిస్తున్నప్పటికీ తప్పుడు ప్రచారాలు చేయటం శోచనీయమన్నారు. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో కూడా పదేండ్ల రాష్ట్ర ఆర్థిక సత్తాను కండ్లకు కట్టే స్థితిని చెప్పక తప్పదు. ఇన్ని సత్యాలు కళ్లముందు కనిపిస్తున్నా క్షమించారని తప్పుడు ప్రచారాలు చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సత్యమే గెలుస్తుంది.
రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేశాం.
సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలోనే అగ్రస్థానంలోనే ఉందని కేటీఆర్ గుర్తు చేశారు. స్టేట్ ఓన్ టాక్స్ రెవిన్యూలో టాప్ ప్లేసుల్లో వుంటూ..స్వంత కాళ్ల మీద నిలబడి స్వయం పోషక రాష్ట్రంగా ఎదిగారు. అప్పుల విషయంలో ఎప్పుడూ ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని దాటకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించామని. జీఎస్డీపీలో అప్పుల నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రాల సరసన తెలంగాణ నిలిచిన విషయం తెలిసినప్పటికీ తప్పుడు ప్రచారాలతో పైశాచికం పొందుతున్నారు. బీఆర్ఎస్ తీసుకున్న అప్పులు కూడా దీర్ఘకాలం కావటంతో వాటిపై వడ్డీల చెల్లింపు భారం కూడా స్వల్పమేనన్నారు. రెవిన్యూ వ్యయంలో వడ్డీల చెల్లింపు శాతం అతి తక్కువగా వున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల్లో సింహభాగం మూలధన వ్యయం చేశారు. ఉన్నాయి ఆస్తులు, సంపద సృష్టించబడిన కేటీఆర్ చెప్పారు.
అద్భుతాలు సృష్టించిన కొత్త రాష్ట్రం
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పారు. దశాబ్దాలుగా రాష్ట్రాలుగా స్థిరపడ్డ పెద్ద పెద్ద స్టేట్స్ ను తలదన్నేలా ఒక కొత్త రాష్ట్రం ఎదగడం అద్భుతమని…దేశాన్ని పోషించే ఐదారు రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణగా నిలవడం కేసీఆర్ గారి కృషితో నే సాధ్యమైంది. జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్, తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులతో ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రతి రంగాన్ని కేసీఆర్ టాప్ లో నిలిపారని గర్వంగా చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడం కారణంగానే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇండెక్స్‌లో నంబర్ వన్ గా ఉన్నామని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఇప్పటికైనా ప్రజలకు కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో కష్టపడి గాడిన ఆర్థిక వ్యవస్థను చేతకాని విధానాలతో నాశనం చేయవద్దని సూచించారు.