Home తెలంగాణ జగిత్యాలలో దారుణమైన జీవన్ రెడ్డి అనుచరుడి హత్య – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

జగిత్యాలలో దారుణమైన జీవన్ రెడ్డి అనుచరుడి హత్య – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
జగిత్యాలలో దారుణమైన జీవన్ రెడ్డి అనుచరుడి హత్య - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • హత్య నిరసిస్తూ నాలుగు గంటల పాటు రాస్తారోకో చేసిన ఎమ్మెల్సీ
  • ఇక మీకో దండం మీ పార్టీకో దండం.. అంటూ కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి దారుణ హత్య. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి(58) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చాలా కాలంగా నమ్మిన వ్యక్తిగా పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. జాబితపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి మంగళవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై ఊర్లోకి వెళ్ళాడు. గుర్తుతెలియని అగంతకులు కారులో వెళ్లి గంగారెడ్డిని ఢీకొట్టగా కింద పడిపోయాడు.. వెంటనే వారి వెంట తెచ్చుకున్న కత్తులతో దారుణంగా పొడిచి తీవ్రంగా గాయపరిచారు.

గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా గంగారెడ్డిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జిల్లా ఆసుపత్రికి వచ్చి గంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలించి మంచి నాయకుడిని కోల్పోయానని భావోద్వేగానికి గురయ్యారు.

అధికారంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుతారా అంటూ జగిత్యాల పాత బస్టాండ్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి జీవన్ రెడ్డి రాస్తారోకో చేశారు. నిందితులపై పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని, 100 డయల్ కు ఫిర్యాదు చేసి చెప్పిన చర్యలు లేవని, ప్రాణ భయం ఉందని రక్షణ కరువైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు పాత బస్టాండ్‌లో నిరసన కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిరసన చేస్తున్న ప్రాంగణానికి చేరుకొని తాను కూడా ఆందోళన చేశారు. విప్ ఆలస్యంగా రావడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీకో దండం మీ పార్టికో దండం… ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి.. అవమానాలకు చూస్తున్నాం.. ఇప్పుడు భౌతిక దాడులు చేసి చంపుతున్నారు.. ఎందుకు భరించాలి… ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన విరమించాలని నిందితులఫై కటిన చర్యలు తీసుకుంటామని డిఎస్‌పి రఘు చంద్రు, రూరల్, పట్టాణ సిఐ కృష్ణ రెడ్డి, వేణు గోపాల్‌లు నచ్చచెప్పిన వారు ఆందోళన విరమించలేదు. చివరికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని నిందితులను తర్వలో పట్టుకొని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించుకోవాలని కోరగా ఆందోళన విరమించారు. అయితే నిందితుడు హత్య చేసి జగిత్యాల రూరల్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ హత్యను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఖండించారు. నిందితులను వెంటనే పట్టుకొని వారి వెనుక ఎలాంటి కుట్ర కోణం బయట పెట్టాలని పొలిసు ఉన్నత అధికారులను ఆదేశించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech