- ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదనను అర్ధం చేసుకున్నాం
- జగిత్యాల అప్పగించిన మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ సీనియర్ నేత గంగారెడ్డి హత్య వెనుక ఎవరున్న వారిని వదిలిపెట్టేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన గంగారెడ్డి హత్య ఘటనను పార్టీ సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్. ఈ హత్యతో సంబంధమున్న ఎవరిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారు.. గంగారెడ్డి హత్యకు గురువడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ఆవేదనను అర్ధం చేసుకున్నామని అన్నారు.
జగిత్యాలలో జరిగిన ఈ హత్య ఘటనకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించామని ఆయన చెప్పారు. ఆయన త్వరలో అన్ని విషయాలు సర్దుకునేలా చేస్తారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇదిలావుండగా, పార్టీ ఆలోచన మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లోకి చేర్చుకున్నామని అన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయన్నారు.